ప్రస్తుతం ఎం ఎస్ రాజు , సుమంత్ అశ్విన్ హీరో గా తెరకెక్కుతున్న 7 డేస్ 6 నైట్స్ అనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ సినిమాను సైతం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
ఈ నేఫద్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు తనయుడు, నటుడు సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.'ఈ సినిమా యువతతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో సాగుతుంది. గతేడాది వచ్చిన 'డర్టీ హరి'తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. 'డర్టీ హరి'ని మించి ఈ చిత్రం ఉంటుంది' అని ఎం.ఎస్.రాజు చెప్పారు. 'ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ '7 డేస్ 6 నైట్స్' సినిమాను సమర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది ' అని సుమంత్ అశ్విన్ అన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రీకరణ హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేసాం. ’’ అన్నారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము.
