Asianet News TeluguAsianet News Telugu

దయనీయ స్థితిలో నటి పావలా శ్యామల.. తినడానికి తిండి కూడా లేక..

తెలుగులో ఎన్నో పదుల సంఖ్యలో ఆమె నటించి.. ప్రేక్షకులను అలరించారు. కాగా.. ప్రస్తుతం మాత్రం ఆమె పరిస్థితి చాల దయనీయంగా ఉంది. 

Movie Actress Pavala Shyamala Facing financial problems
Author
Hyderabad, First Published May 17, 2021, 7:31 AM IST

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? పావలా శ్యామల అనగానే ఎవరికైనా ఈమె ముఖం గుర్తుకురావాల్సిందే. తెలుగులో ఎన్నో పదుల సంఖ్యలో ఆమె నటించి.. ప్రేక్షకులను అలరించారు. కాగా.. ప్రస్తుతం మాత్రం ఆమె పరిస్థితి చాల దయనీయంగా ఉంది. ఓ వైపు అనారోగ్యం పీడిస్తుంటే.. మరో వైపు కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో.. ఎవరైనా సహాయం చేయకపోతారా అని దీనంగా ఎదురుచూస్తోంది.

ఖడ్గం, ఆంధ్రవాలా, బాబాయ్‌ హోటల్‌, గోలిమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల.

కాగా.. ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న నటి కరాటే కళ్యాణి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios