నాగిని ఫేమ్ ‘మౌనీ రాయ్’ (Mouni Roy) మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో కలిసి వివాహా జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్త మౌనీరాయ్ కి ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి  సర్ ప్రైజ్ చేశాడు.   

వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో జనవరి 17న మౌని రాయ్ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ జంట తమ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలె హనీమూన్ కోసం కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు వెళ్లారు. ప్రస్తతం అక్కడి నుంచి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మౌని రాయికి తన భర్త అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కాగా, వీరి వివాహం తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే సందర్భంగా భర్త నంబియార్ మౌని రాయ్ (Mouni Roy)ని సర్ ప్రైజ్ చేశాడు. 

వాలెంటైన్స్ డే గిఫ్ట్ ప్రజంటేషన్ సందర్భంగా ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా నాలుగు డైమండ్ రింగులను గిఫ్ట్ గా అందించారు. దీంతో మౌని రాయ్ ఎంతో సంతోష పడింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికన తన అభిమానులతో పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో మౌనిరాయ్ తన ఎడమ చేతి రింగ్ ఫింగర్ కు నాలుగు డైమండ్ రింగ్స్ ను ధరించింది. 

ప్రేమికుల రోజున మౌని రాయ్ భర్త సూరజ్ నంబియార్ ఆమెకు 4 డైమాండ్ రింగ్స్ ఇవ్వడంతో మురిసిపోతోంది. అయితే తన భర్త నుంచి ఒక బహుమతిని కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదట మౌని రాయి. కానీ ఏకంగా సూరజ్ ఆమెకు నాలుగు డైమాండ్ రింగ్ష్ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా తనతో ఎల్లప్పుడూ ఉండే తన భర్తకి ‘రోజంతా, ఎల్లప్పుడూ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ తెలిపింది.

View post on Instagram

మౌని భర్త కూడా హృదయపూర్వకంగా ఆమెకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో వారి వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. మొన్నటి వరకు హనీమూన్ లో ఉన్న మౌని పలు గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం మౌనీ రాయ్ అయాన్ ముఖర్జీ యొక్క చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీలోనే రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.