సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా దాదాపు మూడు గంటల నిడివితో ఉంది. దీంతో చాలా మంది సినిమా లెంగ్త్ ఎక్కువ ఉందని, బాగా ల్యాగ్ చేశారని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాకి మరికొన్ని సీన్లు యాడ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా..? సరిగ్గా అదే ప్రయోగం చేయబోతుంది 'మహర్షి' టీమ్.

ఈ వారంతంలో లేదంటే వచ్చే వారం నుండి 'మహర్షి' సినిమాకు అదనంగా మరికొన్ని సన్నివేశాలు జత చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్, సెకండ్ హాఫ్ లో రెండు సీన్లను యాడ్ చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వలన సినిమా నిడివి మరో పది నిమిషాలు పెరిగే అవకాశం ఉంది.

అప్పుడు మొత్తంగా చూసుకుంటే సినిమా రన్ టైం 188 నిమిషాలు అవుతుంది. సినిమా మొదటి భాగంలో వచ్చే పెళ్లిచూపులుసీన్ మహేష్ కి చాలా ఇష్టమట. నిజానికి ఆ సీన్ మూడు నిమిషాల పాటు ఉంటుందట. కానీ దాన్ని కుదించి నిమిషంకి చేశారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని యథాతథంగా చూపించాబోతున్నారు.

సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు, అల్లరి నరేష్ మధ్య ఓ సీన్ అలానే రైతులతో మహేష్ బాబు మాట్లాడే మరో సీన్ కూడా యాడ్ చేయబోతున్నారు. మరి ఇలా సన్నివేశాలు యాడ్ చేయడం 'మహర్షి'కి కలిసొస్తుందో లేదో చూడాలి!