టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పెద్ద దుమారానికి తెరతీసిన నటి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కనిపించడం లేదు. మరో చోటుకి వెళ్లి అక్కడ తారలపై కామెంట్స్ చేస్తూ కాలం గడుపుతోంది.

అప్పటివరకు టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలపై కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఉన్నట్టుండి తన మకాంని కూడా మార్చేసింది. దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో ఆమె టాలీవుడ్ సెలబ్రిటీలపై కామెంట్స్ చేయడం కూడా తగ్గించింది. దీనికి కారణం ఓ పొలిటిషియన్ అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ రాజకీయనాయకుడు సదరు నటికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆమె సిటీని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి నెలవారీ జీతం ఇచ్చే విధంగా కొందరు టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలతో డీల్ కూడా కుదుర్చినట్లు తెలుస్తోంది.  రాజకీయనాయకులు ఇన్వాల్వ్ అవ్వడంతో ఇక చేసేదేమీ లేక సదరు నటి సైలెంట్ అయిపోయిందని టాక్.