హీరో విజయ్ దేవరకొండ లియో షూటింగ్ కంప్లీట్ చేశాడు. విజయ్ దేవరకొండ మరొక రొమాంటిక్ సాంగ్ తో పలకరించారు. ఇక ప్రాజెక్ట్ కే, బ్రో చిత్రాల నుండి ఎగ్జైటింగ్ అప్డేట్స్ వచ్చాయి.  

స్టార్ హీరో విజయ్ శరవేగంగా లియో షూటింగ్ పూర్తి చేశాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. ప్రోమోలు ఆకట్టుకోగా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నేడు లియో షూటింగ్ కంప్లీట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అక్టోబర్ 19న విడుదల కానుంది. 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం బ్రో టీమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. డై హార్డ్ ఫ్యాన్స్ తమ ఫోటోలు పంపితే బ్రో థియేటర్స్ వద్ద తమ కట్ అవుట్స్ పవన్, సాయి ధరమ్ తేజ్ కట్ అవుట్స్ తో పాటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. లింక్ లాగినై తమ ఫోటోలు పంపితే లక్కీ ఫ్యాన్స్ బ్రో థియేటర్ వద్ద భారీ కట్ అవుట్ గా అవతరించే ఛాన్స్ కొట్టేయవచ్చు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ జులై 28న విడుదలవుతున్న విషయం తెలిసిందే. 

విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ నుండి 'ఆరాధ్య' సాంగ్ ప్రోమో విడుదల చేశారు. పూర్తి సాంగ్ జులై 12న విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. 

ప్రాజెక్ట్ కే టీమ్ రిక్రూట్మెంట్ ప్రకటన చేసింది. తమకు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కావాలంటూ కోరింది. జులై 20న మొదలయ్యే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ పాల్గొననుంది. ఈ అంతర్జాతీయ సినిమా వేదిక సాక్షిగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్, టైటిల్, ట్రైలర్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్ పెర్ఫార్మన్స్ ని షూట్ చేసేందుకు కెమెరామెన్స్, వీడియోగ్రాఫర్స్ కావాలంట. ప్రభాస్-దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో తన పాత్ర విశేషాలు తెలిపారు హీరో విరాజ్ అశ్విన్

ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి. నేను కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటాడని, చిత్ర విశేషాలు పంచుకున్నారు.