బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటి సభ్యులకు కఠిన పరీక్ష బిగ్ బాస్ పెట్టాడు. రంగులు నింపిన బక్కెట్స్ క్రింద నిల్చోవాలని ఇంటిలోని ఇద్దరి సభ్యులను నిర్ణయించిన బిగ్ బాస్ వారి మధ్య వివాదం రేపే టాస్క్ ఏర్పాటు చేశాడు. ఇంటి లోని సభ్యులను జంటలుగా నిర్ణయించిన బిగ్ బాస్ ఎవరు ఇంటిలో ఉండాలనుకున్నారో, ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి అన్నారు.

 ఈ టాస్క్ లో ఒకరు నామినేట్ అయితే ఒకరు సేవ్ అవుతారు. కానీ హౌస్ లోని ప్రేమజంట అఖిల్, మోనాల్ తన ప్రియుడు కోసం త్యాగం చేసింది. అఖిల్ కోసం తనని తను నామినేట్ చేసుకుంది. దీనితో అఖిల్ పై తనకున్న ప్రేమను ప్రేమను చాటుకుంది. మోనాల్ వీక్ కంటెస్టెంట్ అలాగే వీక్ కంటెస్టెంట్ అని తెలిసినా, ఎలిమినేషన్ లో చివరి వరకు వెళ్లి వచ్చిందని తెలిసినా మోనాల్ అఖిల్ ని సేవ్ చేసి, తనను తాను నామినేట్ చేసుకుంది. 

హౌస్ లోకి వచ్చి నాటి నుండి అఖిల్ ని చాల ఇష్టపడుతున్న మోనాల్ తనపై ఆమెకు ఉన్న ప్రేమను చాటుకుంది. అఖిల్ కోసం ఆమె నామినేట్ అయ్యింది దీనితో అఖిల్ మోనాల్ పై రెడ్ పెయింట్ వేశారు. ఏదైనా మోనాల్ ఈ చర్య ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు అయ్యింది. ఇక టాస్క్ లో అభిజిత్ హారికను సేవ్ చేసి నామినేట్ అయ్యాడు.