బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అందరినీ ఆకర్షించిన లవ్ స్టోరీ మోనాల్-అఖిల్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన మొదట్లో అభిజిత్ కి ఆమె దగ్గరైనట్లు అనిపించింది. ఐతే మెల్లగా అఖిల్ మోనాల్ దగ్గర కావడం మొదలుపెట్టారు. మోనాల్ అప్పుడప్పుడు అభిజిత్ తో కూడా సన్నిహితంగా కనిపించినా, ఎక్కువ సమయం అఖిల్ తోనే ఉండేది. అఖిల్ ని మోనాల్ బాగా ఇష్టపడ్డారని ఆమె చర్యలు నిరూపించాయి. 

మోనాల్ ప్రవర్తన కారణంగా అఖిల్ ఆమెను అవైడ్ చేసినా, మోనాల్ మాత్రం అతనికి దగ్గర కావడానికి ప్రయత్నించేది. చివరికి మోనాల్ ని అఖిల్ నామినేట్ చేసినా ఆమె ఫీల్ కాలేదు. తనను నామినేట్ చేసినా అఖిల్ పట్ల ఆమె కోపం చూపించలేదు. ఇక అఖిల్ సైతం మోనాల్ పై కోపం ప్రదర్శించినా, కష్ట సమయాలలో ఆమెకు అండగా నిలిచాడు. 

ఇక నేటి ఎపిసోడ్ లో స్టేజి పైకి హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను నాగార్జున పిలిచారు. ఐతే నాగార్జున అడిగే ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, అది కరెక్ట్ అని భావిస్తేనే తమ కుటుంబ సభ్యుడిని కలిసే అవకాశం కల్పిస్తానని బిగ్ బాస్ చెప్పాడు. హోస్ట్ నాగార్జున మోనాల్ ని ఓ ప్రశ్న అడిగారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరితో స్నేహం పెట్టుకొని తప్పుచేశానని భావించారు, వారికి నల్ల గులాబీ ఇవ్వాలని చెప్పారు. 

మోనాల్ ఆ సమాధానానికి ఆన్సర్ గా అభిజిత్ కి ఇవ్వడం జరిగింది. అభిజిత్ కొన్ని విషయాలు వెనుక మాట్లాడతాడనే కారణంతో ఎంపిక చేసినట్లు చెప్పారు. మోనాల్ ఆన్సర్ నచ్చిన నాగార్జున ఆమె తల్లిని స్టేజి పైకి పిలిచాడు. మోనాల్ తల్లి ఆమెతో కాసేపు మాట్లాడిన తరువాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని అడిగారు. అందులో మొదటిగా అభిజిత్ పేరు చెప్పింది. ఆ తరువాత మోనాల్, అఖిల్, సోహైల్ మరియు లాస్య అంటే ఇష్టం అని చెప్పింది. 

లిస్ట్ లో మోనాల్ కూడా కాకుండా, అభిజిత్ పేరు చెప్పి ఆశ్చర్య పరిచింది, మోనాల్ తల్లి. ఆమె ఎంపిక చేసిన టాప్ ఫైవ్ లో మోనాల్ కాకుండా ఎవరు మీ ఫెవరేట్ అంటే...అభిజిత్ పేరు చెప్పింది. దీనితో మోనాల్ కి దగ్గరైన అఖిల్ కంటే , అభిజిత్ నే ఆమె ఇష్టపడుతున్నట్లు అర్థం అయ్యింది . దీనితో అల్లుడిగా అఖిల్ కంటే కూడా అభిజిత్ ని కోరుకున్నట్లు అర్థం అయ్యింది.