సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. ప్రతి సభ్యుడు ఇద్దరు ఇంటి సభ్యుల తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేయాలని, అలాగే వారిని ఎందుకు నామినేట్ చేశారో తగు కారణం చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించడం జరిగింది. ఈ ప్రక్రియలో మెజారిటీ ఇంటి సభ్యులు మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్, హారిక మరియు అభిజిత్ లను నామినేట్ చేయడం జరిగింది. దీనితో ఈ ఐదుగురు ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. 

ఐతే అఖిల్ తన ప్రేయసి మోనాల్ ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. మోనాల్ ప్రవర్తన తనకు అర్థం కావడం లేదని, తన బిహేవియర్ కన్ఫ్యుజ్ చేస్తుందన్న కారణంగా మోనాల్ ని అఖిల్ నామినేట్ చేయడం జరిగింది. అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్ ఆవేదనకు చెందారు. పాపంరా అంటూ మోనాల్ పట్ల జాలిని ఆయన కనబరిచారు. 

నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తరువాత మోనాల్ అమ్మ రాజశేఖర్ తో  తన ఆవేదన చెప్పుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. నేను ఎవరిని నమ్ముతున్నారో వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు అంటూ పరోక్షంగా అఖిల్ ని ఉద్దేశిస్తూ చెప్పి బాధపడింది. ఇంటిలో లవ్ బర్డ్స్ గా ఉన్న అఖిల్, మోనాల్ మొదటి నుండి ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయడం ఆసక్తిరేపింది.