అందమైన అబ్బాయిలు, అమ్మాయిలు పాల్గొనే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు, ప్రణయాలు అనేవి సర్వ సాధారణం. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన హీరోయిన్ మోనాల్ పై కుర్ర కంటెస్టెంట్స్ కన్ను పడింది. ముఖ్యంగా హౌస్ లో మోనాల్ ని లైన్ లో పెట్టాలని ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు అభిజిత్, మరొకరు అఖిల్ సార్థా. వీరిద్దరూ మోనాల్ గురించి మొదటి నుండి పోటీ పడుతున్నారు. 

ఐతే మోనాల్ మనసులో ఎవరున్నారనేది కొంచెం సస్పెన్సు గానే ఉంది. మోనాల్ ని తనవైపు తిప్పుకోవాలని అభిజిత్ బాగా ప్రయత్నించినా మోనాల్ మాత్రం అఖిల్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే హౌస్ లో మోనాల్ మాత్రం ఎక్కువగా అభిజిత్ తో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంటి సభ్యులు కూడా గమనించడం జరిగింది.  దీని గురించి ఇంటి సభ్యులు మాట్లాడుకోవడం జరిగింది. 

నేడు మాత్రం ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారు. దీనితో నాగార్జున  పేస్ రీడింగ్ తెలుసు అంటూ మోనాల్ మనసులో ఏ అనే అక్షరం పేరు కలిగిన అబ్బాయి ఉన్నాడని చెప్పాడు. దీనికి మోనాల్ కూడా తన మనసులో ఏ లెటర్ తో మొదలయ్యే అబ్బాయి ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఐతే మోనాల్ కి లైన్ వేస్తున్న అభిజిత్, అఖిల్ ఇద్దరి పేర్లు ఏ తోనే మొదలు అవుతాయి. కానీ మోనాల్-అఖిల్ మధ్య హౌస్ లో కొనసాగుతున్న రిలేషన్ తో పాటు నాగార్జున ఇచ్చిన హింట్ తో మోనాల్, అఖిల్ మధ్య ప్రేమ మొదలైంది అనిపిస్తుంది.