పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ప్రముఖులు ఒక్కొక్కరిగా ఈ లోకాన్ని వీడుతున్నారు. తాజాగా మలయాళ పరిశ్రమకు చెందిన కార్యవట్టం శశి కుమార్ మరణించారు.   

మాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటుడు కార్యవట్టం శశికుమార్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న శశికుమార్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. శశికుమార్ మరణనాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. శశికుమార్ మరణంతో మాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

1989లో కె ఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ బ్రాంచ్ చిత్రంతో శశికుమార్ వెండితెరకు పరిచయమయ్యారు. పరిశ్రమలో ఆయనకు అజాతశత్రువు గా పేరుంది. అందరితో కలిసిపోతూ మంచి నటుడిగా, వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. శశికుమార్ పలు సీరియల్స్ కూడా నటించారు.చిత్ర నిర్మాత మధుపాల్, నటుడు బాలాజీ శర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం ప్రకటించారు.