మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ మరో బారి బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లూసిఫర్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. మలయాళం ఇండస్ట్రీలో 150కోట్లకు పైగా వాసులు చేసిన మొదటి సినిమాగా లూసిఫర్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. 

అయితే ఇప్పుడు అంతకంటే హై రేంజ్ లో ఉండాలని అదే కథకు సీక్వెల్ ని ప్లాన్ చేసున్నారు. ఇక మలయాళ హీరో పృథ్వీ రాజ్ మళ్ళీ డైరెక్షన్ తో మెప్పించాలని ట్రై చేస్తున్నాడు. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ డైరెక్షన్ పై మొదట విమర్శలు వచ్చాయి. 

అయిననప్పటికీ మూవీ రిలీజ్ తరువాత ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే ఇప్పుడు లూసిఫర్ 2కూడా సక్సెస్ అవ్వాలని పృథ్వీరాజ్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.