Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న ఒత్తిడి, మోహన్ లాల్ తప్పు దిద్దుకునే ప్రయత్నం

మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. అలాగే హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా హిట్టయింది. దాంతో ఇటీవలే 'దృశ్యం 2' కూడా రూపొంది రిలీజ్ అయ్యింది.  అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారని మెచ్చుకుంటున్నారు.  

Mohanlal Drishyam movie another sequel announced  jsp
Author
Hyderabad, First Published Feb 26, 2021, 8:56 AM IST

మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. అలాగే హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా హిట్టయింది. దాంతో ఇటీవలే 'దృశ్యం 2' కూడా రూపొంది రిలీజ్ అయ్యింది.  అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారని మెచ్చుకుంటున్నారు.  

మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ కూడా హిట్టవ్వడంతో ఇప్పుడు దీనిని తెలుగులో మళ్లీ వెంకటేశ్, మీనాలతోనే ఇక్కడా రీమేక్ చేస్తున్నారు. అయితే దృశ్యం 2 విషయంలో కేరళలోని థియోటర్స్ యాజమాన్యం చాలా కోపంగా ఉంది. అంత పెద్ద హిట్ సినిమా థియోటర్స్ లో  పడితే ..కలెక్షన్స్ బాగుండేవి,కరోనా టైమ్ లో కాస్తంత ఊరట లభించేదని అంటున్నారు.అయితే మోహన్ లాల్ పట్టుపట్టి మరీ ఓటీటికు ఇచ్చేసారు.

దృశ్యం 2 సినిమాని థియేటర్స్ కి ఇవ్వకుండా డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేయడంపై అక్కడి ఎగ్జిబిటర్స్, థియేటర్స్ యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మోహన్ లాల్ కు కూడా అర్దమైంది. తన సినిమాలు మళ్లీ థియోటర్స్ లో రిలీజ్ అవ్వాలంటే ముందు వారిలో ఉన్న కోపాన్ని,అసంతృప్తిని తొలిగించాలి. అందుకు ఆయన తన దర్శక,నిర్మాతలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నారు.

 'దృశ్యం 3' నిర్మాణం కూడా ఉందని దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా వెల్లడించాడు.  దీనికి సంబంధించిన కథను చూచాయగా మోహన్ లాల్ కు, నిర్మాతకు చెప్పానని, క్లైమాక్స్ విని వారిద్దరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారని దర్శకుడు జోసెఫ్ చెప్పారు. అయితే, స్క్రిప్టును ఇంకా పక్కాగా తయారుచేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. 

ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని, ముఖ్యంగా పార్ట్‌-3 క్లైమాక్స్‌ విన్న మోహన్‌లాల్‌, నిర్మాత ఆంటొనీ పెరంబువర్‌ ఎంతో ఆసక్తి కనబరచారని పేర్కొన్నారు. అయితే స్క్రిప్ట్‌ను మరింత ఆకట్టుకునేలా మలచాలంటే రెండు, మూడేళ్లు పడుతుందన్నారు.  కచ్చితంగా మూడో సీక్వెల్లో కూడా ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తామని భరోసా ఇచ్చారు. 'దృశ్యం 3'తో కూడా ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం జీతూ జోసెఫ్ తెలుగు 'దృశ్యం 2'కి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు. అలాగే హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, టబు సీక్వెల్‌లో నటించేందుకు అంగీకారం తెలిపారు.

2013లో రిలీజ్ అయిన దృశ్యం చిత్రం సూపర్ హిట్ అయింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన తొలి సినిమాగా ఘనత సాధించింది.   సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా తన కూతురు చేసిన మర్డర్ ను తెలివిగా తప్పిస్తాడు. అతను తప్ప వేరెవ్వరికీ తెలియకుండా ఆ శవం మాయం చేస్తాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కు జోడీగా మీనా నటించింది. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ చేసారు. హిందీ,తమిళ భాషల్లో సైతం ఈ సినిమా రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది.  
 
Follow Us:
Download App:
  • android
  • ios