ఇళయరాజా కూతురు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు పరామర్శించారు. ఆయన ఫ్యామిలీకి తన సానుభూతి తెలియజేశారు. 

మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజాని మోహన్‌బాబు పరామర్శించారు. తన సతీసమేతంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. విషాద వార్త విన్న వెంటనే తాను ఇళయరాజాని పరామర్శించానని, వారి కుటుంబానికి తన సానుభూతి తెలియజేసినట్టు వెల్లడించారు. 

ఇందులో మోహన్‌బాబు చెబుతూ, `హృదయ విదారక వార్త విన్న వెంటనే నేను ఇళయరాజాని పరామర్శించాను. కుమార్తె భవతరిణి మరణంతో విషాదంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా` అని తెలిపారు మోహన్‌బాబు. ఇళయరాజాని పరామర్శించిన వారిలో మోహన్‌బాబు ఆయన సతీమణి నిర్మలా దేవి ఉన్నారు. 

ఇళయరాజా కుమార్తె భవతరణిని గత కొంత కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతూ జనవరి 25న మరణించిన విషయం తెలిసింది. ఆమె సినిమా రంగంలోనే ఉన్నారు. సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణించారు. దాదాపు 30కిపైగా చిత్రాలకు పనిచేశారు. అయితే కొంత కాలంగా ఆమె క్యాన్సర్‌ తో బాధపడుతున్నారట. అది విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. 

Scroll to load tweet…

సినిమా కెరీర్‌ పరంగా మోహన్‌బాబుకి ఇటీవల సరైన హిట్లు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నారు. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి `కన్నప్ప` మూవీని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌ వంటి వారు నటిస్తుండటం విశేషం.