రంగస్థలంపై మోహన్ బాబు చిరంజీవిని ఏమన్నారంటే...

First Published 3, Apr 2018, 5:07 PM IST
mohanbabu comments on rangasthalam
Highlights
రంగస్థలంపై మోహన్ బాబు చిరంజీవిని ఏమన్నారంటే...

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై పొగడ్తలు గుప్పించగా తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటుడు మోహన్ బాబు చేరారు. ట్విట్టర్ ద్వారా మోహన్ బాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 

'రంగస్థలం సినిమా గురించి మంచి మాటలు వింటున్నాను. త్వరలో ఈ సినిమా చూస్తాను. చరణ్‌తో పాటు సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు. కొడుకు విజయాన్ని కళ్లారా చూడటం కంటే తండ్రి కోరుకునేది ఏమీ ఉండదు. నా ప్రియమిత్రుడు చిరంజీవి గర్వపడుతున్నాడని భావిస్తున్నాను. అందరికీ కంగ్రాట్స్' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

 

మార్చి 30న విడుదలైన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు దుమ్ము రేపుతోంది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. మరో వైపు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ మార్కును దాటేసి పరుగులు పెడుతోంది.

 

సుకుమార్ రాసుకున్న 1980 కాలంనాటి పల్లెటూరి కథా నేపథ్యం, చెవిటివాడిగా హీరో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, సమంత అందం, నటన, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, అప్పటి పరిస్థితులకు అద్దంపట్టే రామకృష్ణ ఆర్ట్ వర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ అన్నీ కలగలిపి 'రంగస్థలం' చిత్రాన్ని ఓ రేంజికి తీసుకెళ్లాయి.

loader