ఈ ఏడాది సినిమాల జాతర ఈ నెల నుంచే మొదలవ్వబోతోంది.  అయితే ఇప్పటికే పెద్ద సినిమాల రీలీజ్ డేట్లను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ రిలీజ్ డేట్ ను కూడా రిలీజ్ చేశారు.  

సీనియర్ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి డైమండ్ రత్న బాబు కథ, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నటుడు ‘మంచు విష్ణు’ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ప్రుధ్వీ రాజ్, రఘు బాబు వంటి సీనియర్ నటులు పలు పాత్రలను పోసించారు. ఇళయరాజ సంగీతం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో చిత్రం మరింత ఆకర్షణీయంగా ఉంది.

Scroll to load tweet…

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై మూవీ మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. ఫిబ్రవరి 18న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ డేట్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేశారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల కంటే ముందే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

మరోవైపు సినిమాలన్నీ వరుసగా రిలీజ్‌ డేట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫిబ్రవరి 25న, 'రాధేశ్యామ్‌' మార్చి 11న, 'ఆర్‌ఆర్‌ఆర్‌' మార్చి 25న, 'ఆచార్య' ఏప్రిల్‌ 29న, 'ఎఫ్‌ 3' ఏప్రిల్‌ 28న, 'సర్కారువారి పాట' మే 12న, 'భీమ్లా నాయక్‌' ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1న రిలీజవుతున్నట్లు ప్రకటించాయి. ఈ సినిమాల రిలీజ్ కు ముందే ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీని రిలీజ్ చేసి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారు.