40 ఏళ్లకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సేవ చేస్తున్న మోహన్ బాబు(Mohan Babu).. శ్రీ విద్యా నికేతన్ స్కూల్స్ ద్వారా విద్యా దాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల సేవకు గుర్తింపుగా తన విధ్యా సంస్థలకు యూనిర్సిటీ గుర్తింపు వచ్చిందంటూ అనౌన్స్ చేశరు మోహన్ బాబు.

40 ఏళ్లకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సేవ చేస్తున్న మోహన్ బాబు(Mohan Babu).. శ్రీ విద్యా నికేతన్ స్కూల్స్ ద్వారా విద్యా దాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల సేవకు గుర్తింపుగా తన విధ్యా సంస్థలకు యూనిర్సిటీ గుర్తింపు వచ్చిందంటూ అనౌన్స్ చేశరు మోహన్ బాబు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు(Mohan Babu) ఓ బ్రాండ్. నటుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆయన. తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్(Sree Vidyaniketan) స్టార్ట్ చేసి.. విద్యా దాతగా కూడా ఎన్నో మెట్లు ఎక్కారు. రెండున్నర దశాబ్ధాలుగా కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. పేదవారికి సాయం చేస్తున్నారు మోహన్ బాబు. ఇన్నేళ్ల కృషికి ఇఫ్పుడు పెద్ద ప్రతిఫలం వచ్చింది. శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు మోహన్ బాబు.

Scroll to load tweet…

ట్విట్టరో లో ప్రకటిస్తూ.. చిన్న మెక్క మొదలైన శ్రీ విద్యా నికేతన్(Sree Vidyaniketan) ఈరోజు విద్యా కల్పవృక్షంగా మారింది. 30 ఏళ్ల మీ నమ్మకం.. నా జీవితపు కృషి. ధ్యేయం ఈరోజు నెరవేరాయి, ఈ విద్యా సంస్థలను యూనివర్సిటీగా మార్చేసాయి. తిరుపతిలో ఇప్పటి నుంచీ మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీ ఉంటుంది. మీ ప్రేమ అండదండలు ఎప్పిటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటూ.. మీ మోహన్ బాబు అంటూ లెటర్ రిలీజ్ చేశారు.

అయితే ఈ అనౌన్స్ మెంట్ కు ముందు మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఓ ట్వీట్ చేశారు. మోహన్ బాబు గోప్ప వార్త చెప్పబోతున్నారని. దేవుడు దయ వల్ల మంచి న్యూస్ వినబోతున్నట్టు విష్ణు ట్వీట్ చేశారు. విష్ణు ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. మోహన్ బాబు MBU ని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న మంచు అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

Scroll to load tweet…

ఇక నటుడిగా రకరకాల పాత్రల్లో మెరిసిన మోహన్ బాబు(Mohan Babu) నిర్మాతగా కూడా 50 సినిమాల వరకూ చేశారు. ఆ తరువాత విద్యా వేత్తగా మారిపోయి 1993 లో తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్(Sree Vidyaniketan) స్టార్ట్ చేశారు. ఈ విద్యా సంస్థల్లో ఇంటర్నేషనల్ స్కూలో తో పాటు కాలేజి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ కూడా న్నాయి. ఎప్పటి నుంచో ప్రయత్నించగా ఇన్నాళ్ళకు ఈ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా దక్కింది.