మంచు విష్ణు ఆరోగ్యం ఎలా ఉంది? అప్డేట్ ఇచ్చిన తండ్రి మోహన్ బాబు
డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ లో పాల్గొన్న హీరో మంచు విష్ణు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స అదిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై తండ్రి మోహన్ బాబు అప్డేట్ ఇచ్చారు.
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ఎట్టకేళలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) షూట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టులోనే ఈ పాన్ ఇండియా మూవీ శ్రీకాళహస్తిలో మొదలైంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండ్రోజుల కింద మంచు విష్ణు షూటింగ్ లో గాయపడ్డ విషయం తెలిసిందే. డ్రోన్ కెమెరా అదుపుతప్పి తగలడంతో చేతికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్ప్రతికి తరలించారు.
తాజాగా మంచు విష్ణు ఆరోగ్యంపై తండ్రి మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు. మంచు విష్ణుపై మీ అందరి ప్రేమ, ఆయన హెల్త్ పై ఆందోళనకు కృతజ్ఞతలు. న్యూజిలాండ్‌లో కన్నప్ప సెట్లో విష్ణుకు ప్రమాదం జరిగింది. భగవంతుని దయతో కోలుకుకుంటున్నాడు. త్వరలో మళ్లీ షూటింగ్‌కి తిరిగి వస్తాడు. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు. హర హర మహాదేవ్!.. అంటూ ఎక్స్ వేదికన వెల్లడించారు. దీంతో విష్ణు అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఆ మధ్యలో చిత్ర యూనిట్ న్యూజిలాండ్ కు ఎనిమిది భారీ కంటైనర్లను తరలించారు. అక్కడ ఓ భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను విష్ణుపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణుమీదకి దూసుకొచ్చింది. చేతికి తీవ్రంగా గాయమైంది. చికిత్స అందుతుండటంతో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ‘కన్నప్ప’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ప్రాజెక్ట్ ను దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నయనతార, అనుష్క కనిపించబోతున్నట్టు సమాచారం. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.