మంచు బ్రదర్స్ మధ్య తలెత్తిన విబేధాలకు కారణాలు ఏంటనే చర్చ నడుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ బయట కనిపిస్తే మీడియా స్పష్టత అడుగుతున్నారు. మోహన్ బాబు, మనోజ్ ఈ విషయమై మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ చెప్పారు.
నటుడు మోహన్ బాబు కుమారుల మధ్య విబేధాలు తలెత్తాయని పబ్లిక్ గట్టిగా నమ్ముతున్నారు. గత ఆరు నెలలుగా ఆ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు పలు అనుమానాలకు దారితీశాయి. హీరో మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబు, విష్ణులకు ఇష్టం లేదని, అందుకే మనస్పర్థలు తలెత్తాయనే ఓ వాదన ఉంది. అలాగే ఆస్తి గొడవలు కూడా అంటూ మరొక వాదన. ఏది నిజమనేది తెలియదు. వీటన్నింటి సమాహారం కూడా కావచ్చు.
మనోజ్ వివాహానికి విష్ణు దూరంగా ఉండటంతో అనుమానాలు బలపడ్డాయి. ఇక మనోజ్ లీక్ చేసిన వీడియో పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ మూవీ ఓపెనింగ్ ఈవెంట్లో మనోజ్ పాల్గొన్నారు. మీడియా ఆయన్ని వీడియో గురించి అడగ్గా... తెలివైన సమాధానం చెప్పి తప్పుకున్నారు. నా కంటే టీవీ 9 వాళ్లకు బాగా తెలుసు అంటూ నవ్వేశాడు. విషయం దాటవేస్తూ తన అప్ కమింగ్ చిత్రాలు గురించి మాట్లాడి వెళ్లిపోయారు.
తాజాగా మనోజ్ ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు. తిరుపతి నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి మోహన్ బాబు, మనోజ్, భూమా మౌనిక హాజరయ్యారు. మీడియా ఇంటరాక్షన్ లో మోహన్ బాబు, మనోజ్ లకు ఈ ప్రశ్న ఎదురైంది. మోహన్ బాబు మీడియా మీద అసహనం వ్యక్తం చేయగా మనోజ్ సెటైరికల్ గా మాట్లాడి విషయం పక్కదోవ పట్టించారు. మోహన్ బాబు మాట్లాడుతూ... మీ ఇంట్లో నీ భార్యతో నీకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పగలవా? మీరంతా చదువుకున్నవారు. సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడగండని.. ఫైర్ అయ్యారు.
కనీసం మనోజ్ మాట్లాడతారని మీడియా ఆశపడగా ఆయన మరింత దారుణమైన సమాధానం చెప్పారు. రీసెంట్ గా ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటని అడగ్గా... నాకు సెగ్గడ్డ లేచింది. అదే నా సమస్య. మీరు గోకుతారా? అని సెటైర్ వేశారు. మరోసారి మీడియా ప్రతినిధి అడిగినా ఆయన స్పందించలేదు. త్వరలో వాట్ ది ఫిష్, మనంమనం బరంపురం చిత్రాలు స్టార్ట్ చేయబోతున్నాము. కెనడాలో చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నామంటూ లేటెస్ట్ చిత్రాల అప్డేట్ ఇచ్చారు.
