చక్రవాకం, మొగలిరేకులు టీవీ సీరియల్స్ విశేషంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ సీరియల్స్ ద్వారా యువ నటుడు పవిత్ర నాథ్ ఎంతో గుర్తింపు పొందారు. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్రనీల్ తమ్ముడు దయ పాత్రలో పవిత్రనాథ్ నటించాడు.
చక్రవాకం, మొగలిరేకులు టీవీ సీరియల్స్ విశేషంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ సీరియల్స్ ద్వారా యువ నటుడు పవిత్ర నాథ్ ఎంతో గుర్తింపు పొందారు. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్రనీల్ తమ్ముడు దయ పాత్రలో పవిత్రనాథ్ నటించాడు. అయితే మార్చి 1న పవిత్రనాథ్ ఊహించని విధంగా మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
అత్యంత పిన్న వయసులో దయ అలియాజ్ పవిత్రనాథ్ మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకున్నారు. మొగలిరేకులు తర్వాత పవిత్రనాథ్ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీనితో అతడి పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. పవిత్ర నాథ్ కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అంటూ అతగాడి భార్య శశిరేఖ స్వయంగా ఆరోపణలు చేసింది.
కానీ పవిత్రనాథ్ ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. అయితే అతడి మృతికి సరైన కారణాలు బయటకి రాలేదు. పవిత్రనాథ్ మరణించిన రెండు రోజుల తర్వాత అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంత కాలంగా పవిత్రనాథ్ ఎవ్వరిని కలవడం లేదట. ఒంటరిగా ఉంటున్నాడట. మద్యానికి బానిసయ్యాడా అనే అనుమానాలు ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం నుంచి పవిత్రనాథ్ కి ఊపిరితిత్తుల సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. నాలుగురోజుల నుంచి ఆ సమస్య ఎక్కువైందట. పవిత్రనాథ్ మరణించిన రోజు అతడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందట. దీనితో కుటుంబ సభ్యులు దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే లోపే పవిత్రనాథ్ పరిస్థితి విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు. హార్ట్ ఫెయిల్ కావడంతో మరణించినట్లు పేర్కొన్నారు.
