పైన ఫోటో చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడంతో ఆ ఫోటో బాగా వైరల్ అవుతోంది. దానికి తోడు వర్మ ఆ ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్ కూడా అదిరిపోయింది. అసలు వర్మ సినిమాలకు ప్రమోషన్స్ చేయడంలో ఎవరి సరితూగరని చెప్పవచ్చు. 

ఫొటోలో కనిపిస్తోన్న ఫోటోని చూసి లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పీఎం సైడ్ నుంచి ప్రమోషన్సా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత జనతా పార్టీ ఇటీవల నిర్వహించిన గుంటూరు సభ కోసం హాజరైన మోడీ లక్ష్మి పార్వతిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. 

అది కాస్త వర్మకు తెలియడంతో సినిమాకు ప్రమోషన్ లా వాడేస్తున్నాడు. లక్ష్మి  పార్వతి ఎంట్రీ అనంతరం ఎన్టీఆర్ కెరీర్ ఏ విధంగా ముందుకు సాగింది అనేది వర్మ తన సినిమాలో చూపించనున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేయనున్నారు.