Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ వాయిదా పడ్డ వరుణ్ తేజ్ మిస్టర్ విడుదల తేదీ

  • మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్
  • తొలుత ఏప్రిల్ 14 ఫిక్సయినా 13కు విడుదల తేదీ మార్పు
  • తిరిగి విడుదల తేదీని వాయిదా వేసి 14కు మార్చినట్లు వరుణ్ తేజ, శ్రీను వైట్ల ట్వీట్స్

 

mister release date changed again to april 14

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ సినిమాను మొదట ఏప్రిల్ 14నే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో ఒక రోజు ముందే వస్తున్నామంటూ ప్రకటించారు. అలా అంతా ఏప్రిల్ 13కే ఫిక్స్ అయ్యారు. ఈ డేట్ ఎనౌన్స్ చేసి వారం రోజులైనా కాకముందే మళ్లీ మాటమార్చారు. తిరిగి ఏప్రిల్ 14నే వస్తున్నామని ప్రకటించారు. 

ఏప్రిల్ 14 శుక్రవారం పడింది. సహజంగానే ఏ సినిమా అయినా శుక్రవారమే రిలీజ్ అవుతుంది. కాకపోతే ఓవర్సీస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని 13కు రిలీజ్ ను ప్రీ-పోన్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఏమైందో ఏమో 14నే వస్తున్నామంటూ దర్శకుడు శ్రీనువైట్ల, హీరో వరుణ్ తేజ్ ట్వీట్స్ చేశారు. 

రిలీజ్ డేట్ లోనే కాదు..  షూటింగ్ విషయంలో కూడా ఇంతే కన్ఫ్యూజన్ ఉంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే, ఓ సాంగ్ షూటింగ్ కోసం యూనిట్ అంతా ఇటలీకి వెళ్లింది. తాజాగా ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు.

ఇక సినిమా విడుదల తేదీపైనే ఇలా అటూ ఇటూ అంటూ కన్ ఫ్యూజన్ పెంచేసిన టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 7వ తేదీన ఉంటుందని ప్రకటించారు. మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా చెప్పిన టైమ్ కు చేస్తారో లేదో.. దేవుడా...

Follow Us:
Download App:
  • android
  • ios