మంచి సందేశాత్మక చిత్రాలను ఎంచుకోవడంలో ముందుండే అక్షయ్ కుమార్ మినిమమ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడం కామన్ గా మారింది. మిషన్ మంగళ్ తో ఈ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ స్టార్ మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. గత నాలుగేళ్లలో ఇండిపెండెన్స్ డే సందర్బంగా రిలీజ్ చేసిన సినిమాలు అక్షయ్ క్రేజ్ ను పెంచాయి. 

పైగా తన మార్కెట్ ను కూడా క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బాన్ని పురస్కరించుకొని 2016లో వచ్చిన రుస్తోమ్ మొదటిరోజు 14.10కోట్లను అందుకోగా.. 2017లో వచ్చిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ 13.10కోట్లను కలెక్ట్ చేసింది. ఇక గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన గోల్డ్ సినిమా 25.25 కోట్లను రాబట్టింది. 

ఇక నిన్న ఆగస్ట్ 15కి వచ్చిన మిషిన్ మంగళ్ అక్షయ్ కుమార్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. మొదటి రోజు ఈ సినిమా 29కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద న్యూ రికార్డ్ ని క్రియేట్ చేసింది. జగన్ శక్తి దర్శకత్వం వహించిన మిషన్ మంగళ్ సినిమాలో విద్యా బాలన్ - సోనాక్షి సి