‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ గత ఏడాది ఇటలీ వెళ్లినప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ స్క్రిప్ట్‌ను వినిపించారట క్రిస్టోఫర్. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. అంతేకాదు.. ఇటలీలో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ అప్పుడే ‘మిషన్: ఇంపాజిబుల్ 7’కు సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా ప్రభాస్ పూర్తి చేశారనే టాక్ నడుస్తోంది.
హాలీవుడ్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో ప్రభాస్ నటించనున్నారు అంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కలసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. భారతీయ నటుడు ప్రభాస్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి ముందుకు వచ్చారని క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు టాలీవుడ్ మీడియా చెప్పేస్తోంది.
అంతేకాదు ‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ గత ఏడాది ఇటలీ వెళ్లినప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ స్క్రిప్ట్‌ను వినిపించారట క్రిస్టోఫర్. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. అంతేకాదు.. ఇటలీలో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ అప్పుడే ‘మిషన్: ఇంపాజిబుల్ 7’కు సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా ప్రభాస్ పూర్తి చేశారనే టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఒక అభిమాని ..ఆ దర్శకుడునే డైరక్ట్ గా అడిగేసాడు. దానికి ఆయన హుందాగా స్పందించారు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ సమాధానం ఇస్తూ, “ప్రభాస్ చాలా టాలెంటెడ్ పర్శన్..కానీ మేము ఎప్పుడూ కలవలేదు.” అంటూ ప్రభాస్ కు తన సినిమాలో స్దానం లేదని , వినపడేవన్నీ రూమర్సే అని కొట్టిపారేసాడు. ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న విడుదల కానుంది.
ఇక డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ చూపు మొత్తం భారీ బడ్జెట్ సినిమాలపైనే పడింది. ఇక ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేసేందుకు అటు దర్శక నిర్మాతలు సైతం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం ఈ రెబల్ స్టార్.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయాడు.
