అనుష్కకు హిట్ పడిందబ్బా... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 5 డేస్ కలెక్షన్స్!
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ అయింది ఈ మూవీ ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయ్యింది.

చాలా గ్యాప్ తర్వాత ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేసింది అనుష్క శెట్టి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం కోసం జతకట్టింది. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఫస్ట్ వీక్ ముగియకుండానే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 5 రోజుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి.
ఐదు రోజులకు నైజాంలో రూ. 4.57 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ లో రూ. 74 లక్షలు. ఆంధ్రాలో రూ. 2.85 కోట్ల వసూళ్లు దక్కాయి. ఏపీ/తెలంగాణాలో రూ. 8.16 కోట్ల షేర్ రూ. 14.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.16 కోట్ల షేర్ అందుకుంది. ఓవర్సీస్లో రెస్పాన్స్ అదిరిపోయింది. రూ. 5.36 కోట్ల షేర్ దక్కింది. వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్స్ చూస్తే... రూ. 14.68 కోట్ల షేర్, రూ. 28.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వరల్డ్ వైడ్ రూ. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.13.50 కోట్లు. అంటే ఐదవరోజుకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రభాస్, రామ్ చరణ్, రానా వంటి స్టార్స్ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. అనుష్క ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనకున్నా స్టార్స్ ఇన్వాల్వ్ కావడం ప్లస్ అయ్యింది. యూవీ క్రియేషన్స్ నిర్మించగా మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు.