Asianet News TeluguAsianet News Telugu

#Mirzapur3:’మీర్జాపూర్‌ సీజన్ 3′ స్ట్రీమింగ్‌ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?


క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌గా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది ‘మీర్జాపూర్’. పంక్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు తెరకెక్కించారు. 

Mirzapur Season 3 Streaming date is locked jsp
Author
First Published Jan 18, 2024, 11:50 AM IST

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ (Mirzapur). ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు హిట్‌ అవటంతో మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానిపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సీజన్ 3 మార్చి చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే దీని షూటింగ్‌ పూర్తయినట్లు నటీనటులు తెలిపారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకొన్న ఈ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్‌ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. 

ఇక ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. మూడో సీజన్‌ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఈ సిరీసే కాదు గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. దీంతో మూడో దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు.  ఈ సిరీస్‌ను గుర్మీత్‌ సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌లు తెరకెక్కిస్తున్నారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రితేశ్‌ సిద్వానీ నిర్మిస్తున్నారు.

ఇక మీర్జాపూర్‌ సిరీస్‌ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి .ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మరియు బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే ఈ సిరీస్ లో ఎక్కువగా హింస, రొమాన్స్‌ తో కూడిన సన్నివేశాలు ఉండడం మీర్జాపూర్‌ సిరీస్‌లో  ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక మొదటి సీజన్‌లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ మరియు భార్య శ్వేతలను కోల్పోతాడు.అదే రెండో సీజన్‌ లో మున్నాపై గుడ్డూ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడో చూపించారు.ఇక మూడో పార్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios