జూ.ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన తెలంగాణ మంత్రి పొంగులేటి.. కారణం ఏంటంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో పాన్ ఇండియా విధ్వంసం సృష్టించేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ లో పాన్ ఇండియా విధ్వంసం సృష్టించేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ కి జోడిగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇటీవల ఎక్కువగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటికి రాజకీయ నేతల తాకిడి ఎక్కువవుతోంది. ఆ మధ్యన అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ కావడం చూశాం. తారక్ పాలిటిక్స్ లో ఉన్నా లేకున్నా అతడి పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా తారక్ పేరు రాజకీయాలతో ముడిపడి ఉంది.
అయితే తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదు. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కొడుకు లోహిత్ రెడ్డి వివాహ వేడుక త్వరలో జరగబోతోంది. ఈ సందర్భంగా తారక్ ని ఆహ్వానించడానికి పొంగులేటి శ్రీనివాస్ తన సోదరుడిని వెంటబెట్టుకుని వెళ్లారు. తమ కుమారుడి పెళ్ళికి రావాలని ఆహ్వానించారు.
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇద్దరినీ పొంగులేటి ఆహ్వానించడం విశేషం. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని రోజుల క్రితమే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆశిష్ రెడ్డి వివాహానికి తారక్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ మరో పెళ్ళికి ఆహ్వానం అందింది.