అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఆప్ కు క్రేజ్  తీసుకు రావడానికి మిల్కీ బ్యూటీ తమన్నా జాయిన్ అవుతోంది. ఆమె తో ఒక స్పెషల్ టాక్ షో ప్లాన్ చేశారు. వరసగా సినిమాలు చేస్తున్న ఆమె అరవింద్ అడగటంతో ఒప్పుకుందని సమాచారం. అయితే ఈ షో చేయడానికి మిల్కీ రెమ్యూనరేషన్ భారీగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ టాక్ షోలో ఒక్కొక్క ఎపిసోడ్  చేయడానికి 8 లక్షల రూపాయల వరకు తీసుకోనున్నారట. సినిమాలలో తమన్నా ప్రస్తుతం తీసుకునే రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఇది భారీ మొత్తం అని అంటున్నారు. తమన్నా హోస్ట్ చేయబోయే ఈ షో కి టాలీవుడ్ స్టార్స్ ను తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్.

 ప్రస్తుతం కరోనా కారణంగా జనాలు కూడా థియేటర్లకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఆహా ఓటిటికి మరింత క్రేజ్ పెంచటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ మేరకు త్వరలో ప్రకటన వచ్చే అవకాసం ఉంది. అయితే తమన్నా టాక్ షో అనగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టాక్ షో అంటే మంచు లక్ష్మి గుర్తు వస్తుంది. ఆమె చేసిన టాక్ షో లు చాలా ఫేమస్. స్పాటినిటీగా మాట్లాడటం,సెలబ్రెటీలతో తనకున్న పరిచయాలతో జోక్స్ వేయటంతో సరదాగా నడుపుతుంది. మరి తమన్నా అవన్ని చేయగలదా..ఇప్పటిదాకా వేరే వాళ్ల షోలలో తమన్నా కనిపించింది. 

ఇప్పుడు తమన్నా షోలో వేరే సెలబ్రెటీలు కనిపించబోతున్నారు. ఆమెతో నటించిన హీరోలతో ఆమె చిట్ చాట్ ఉంటుందంటున్నారు. రామ్ చరణ్, రవితేజ,అల్లు అర్జున్,  లాంటి స్టార్స్ కూడా ఈ టాక్ షో లో వస్తావని చెప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే షో పెద్ద హిట్ అవుతుంది. అరవింద్ ఆలోచన అద్బుతమవుతుంది. అలా కాకుండా చిన్న నటులను పిలిచి మాట్లాడటం మొదలెడితే, ఆహాలో వస్తున్న వెబ్ సీరిస్ లాగ  కష్టమే అంటున్నారు.

తమన్నా విషయానికి వస్తే..తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్‌లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.