Asianet News TeluguAsianet News Telugu

మిహీకా పెళ్ళి డ్రెస్‌ ఖర్చు ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

సెలబ్రిటీలు పెళ్ళి వేడుకల్లో భారీ డిజైనర్‌ వేర్‌తో ధగధగ మెరిసిపోయే దుస్తులు ధరిస్తారు. అంతేకాదు ఇదివరకు ఎవరూ ధరించని విధంగా సాధ్యమైనంత వరకు చాలా కొత్త డ్రెస్సులను ఎంపిక చేసుకుంటారు. 

mihika bajaj wore a dress worth rs.6 lakh at her wedding with rana
Author
Hyderabad, First Published Aug 10, 2020, 10:54 AM IST

సినీ తారల పెళ్లి వేడుక అంటే ప్రధానంగా వారు ధరించే డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుంటాయి. అభిమానులు ఫస్ట్ గా గమనించేది వారు ధరించే పెళ్ళి డ్రెస్సులే. అవి ఎంత గ్రాండియర్‌లుక్‌లో ఉన్నాయి, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయనేది గమనిస్తారు. వాటిని చూసి తరించిపోతారు. అందుకే సెలబ్రిటీలు సైతం డ్రెస్సులకు ప్రయారిటీ ఇస్తారు. వాటి కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనకాడరు. సినిమాల్లో హీరోహీరోయిన్లు వేసిన కాస్ట్యూమ్స్ ని బయట అభిమానులు ఫాలో అవుతుంటారు. అంతగా వాటిని ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆచితూచి డ్రెస్‌ సెలక్షన్‌ ఉంటుంది. ఇక పెళ్ళి వేడుకల్లో అయితే భారీ డిజైనర్‌ వేర్‌తో ధగధగ మెరిసిపోయేలా చూసుకుంటారు. అంతేకాదు ఇదివరకు ఎవరూ ధరించని విధంగా సాధ్యమైనంత వరకు చాలా కొత్త డ్రెస్సులను ఎంపిక చేసుకుంటారు. 

అందుకే సెలబ్రిటీల మ్యారేజ్‌, బర్త్ డే, రిసెప్షన్‌ వంటి పలు వేడుకల్లో దుస్తుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తాజాగా రానా, మిహీకా పెళ్ళి వేడుకలో కూడా వారు ధరించిన పెళ్ళి డ్రెస్ హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా మిహీకా ధరించి పెళ్ళి డ్రెస్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. పెళ్లిలో ఆమె బంగారు, క్రీమ్‌ రంగు లెహంగాలో మెరిశారు. అయితే దాని ధరేంతో తెలిస్తే మాత్రం మతిపోతుంది. ఆ డ్రెస్‌ కోసం మిహీకా ఏకంగా రూ.6లక్షలు వెచ్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఆ లెహంగా తయారికి ఖర్చు అయ్యిందట. ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా దీన్నిడిజైన్‌ చేశారు. కొన్ని గంటలపాటు దీని కోసం పనిచేసినట్టు ఆమె తెలిపారు. 

ఇంత భారీగా ఖర్చు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడంతా మిహీకా డ్రెస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక మరోవైపు ఈ పెళ్ళిలో హీరోయిన్‌ సమంత కూడా హైలైట్‌ అయ్యింది. ఆమె నీలం రంగు చీరలో కనువిందు చేసింది. దీనికి లక్షన్నర ఖర్చు చేసింది. అలాగే హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్‌కి రెండు లక్షల వెచ్చిందట. దీన్ని అర్పితా మెమతా డిజైన్‌ చేశారు.

మొత్తంగా శనివారం జరిగిన రానా-మిహీకా పెళ్లి వేడుక టాలీవుడ్‌లో ఇప్పుడు హల్చల్‌ చేస్తుంది. ఈ మ్యారేజ్‌ అతికొద్ది మంది బంధువులు, అతిథులతో గ్రాండియర్‌ లుక్‌లో, ఆద్యంతం సందడిగా సాగిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios