నాగ చైతన్య వరస పెట్టి సినిమాలు కమిటవ్వుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న మజిలి, బాబి డైరక్షన్ లో చేస్తున్న వెంకీ మామ కాకుండా ఇప్పుడు మరో చిత్రం కమిటయ్యాడు. నానితో కృష్ణార్జున యుద్దం చేసి, డిజాస్టర్ ఇచ్చిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ఓకే చేసినట్లు సమాచారం.

యువి క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లా సాగనుంది. కొత్త రకమైన నేరేషన్ లో కామెడీని కలిపి ఈ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.  కృష్ణార్జున విజయం రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాకు స్క్రిప్టునే నమ్ముకుని నాగచైతన్య ఓకే చేసినట్లు చెప్తున్నారు.

గత కొద్ది నెలలుగా మేర్లపాక గాంధీ ఇదే సబ్జెక్టు మీద తన టీమ్ తో వర్క్ చేసి బౌండెడ్  స్క్రిప్టు రెడీ చేసి నాగచైతన్య నేరేషన్ ఇచ్చాడు. డైలాగు వెర్షన్ రెడీ చేస్తున్న ఈ కథకు నాగచైతన్య ఫస్ట్ ఎటెమ్ట్ లోనే ఓకే చేప్పాడని తెలుస్తోంది. ముఖ్యంగా చైతూ క్యారక్టర్ చాలా కాలం నిలిచిపోతుందని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంభందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.