బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన అర్జున్ మాథుర్ తనకు అబ్బాయిల నుండి పెళ్లి ప్రపోజల్స్ ఎక్కువయ్యాయని చెబుతున్నారు. హీరోని పెళ్లి చేసుకోమని అబ్బాయిలు అడగడం ఏంటి అనుకుంటున్నారా..? దీనంతటికీ కారణం అర్జున్ మాథుర్ నటించిన ఓ వెబ్ సిరీస్.

శోబితా ధూళిపాళ్ళ, అర్జున్ మాథుర్ ప్రధాన పాత్రల్లో 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇందులో అర్జున్ స్వలింగ సంపర్కుడిగా 'గే' పాత్రలో కనిపిస్తాడు. సిరీస్ లో అతడు మరో అబ్బాయితో కలిసి సెక్స్ చేయడం వంటి సన్నివేశాలను బోల్డ్ గా చూపించారు.

దీంతో అతడికి ఒకరకమైన ఇమేజ్ వచ్చింది. తనవద్దకు వచ్చి ఎవరూ నేరుగా మీరు 'గే'నా..? అని అడగకపోయినా.. ఈ వెబ్  సిరీస్ తరువాత అబ్బాయిల నుండి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని చెప్పారు. చాలా మంది అబ్బాయిల నుండి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని అన్నారు.

తన నటనకు ఓ పక్క ప్రశంసలు దక్కుతున్నా.. మరోపక్క అబ్బాయిల నుండి వస్తోన్న ఈ పెళ్లి ప్రపోజల్స్ తో విసిగిపోయాడట. తనొక విషయం చెప్పాలనుకుంటున్నానని.. నటించే పాత్రలను, నిజ జీవితాలతో కలిపి చూడద్దని రిక్వెస్ట్ చేశారు.