సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై మీమ్స్, కామెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. కావాలని కొందరిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. అవతలి హీరో ఎక్కడ దొరుకుతాడా..? అని ఎదురుచూస్తుంటారు యాంటీ ఫ్యాన్స్.

రీసెంట్ గా చిరంజీవి నటించిన 'సై రా' మేకింగ్ వీడియో విడుదలైంది. ఆ వీడియో చివరిలో చిరంజీవి కత్తి పట్టుకొని, ఆగ్రహంతో ప్రత్యర్ధిని నరికేస్తూ కనిపించారు. ఆ సీన్ లో చిరంజీవి జుట్టు మొహం మీదకు పడుతూ, మోహంలో రౌద్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

నిజానికి సినిమాలో క్యారెక్టర్ ఎంత ఫోర్స్ గా ఉందో చూపించాలని మేకింగ్ వీడియోలో ఈ సీన్ యాడ్ చేశారు. కానీ ఈ విషయం యాంటీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. వాళ్లకి మీమ్స్  చేసుకోవడానికి మంచి ఆప్షన్ దొరికినట్లైంది. బాలకృష్ణ నటించిన 'శాతకర్ణి' సినిమాలో కొన్ని గెటప్ లు, అలానే రకరకాల ఫోటోలను క్లబ్ చేసి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ది బెస్ట్ లుక్స్ ఆఫ్ టాలీవుడ్ అంటూ రకరకాల ఫోటోలు పక్కన పెట్టి మరీ వెటకారం చేస్తున్నారు. నిజానికి సినిమాలో చిరంజీవి లుక్ కి మొదట్లో చాలానే అప్లాజ్ వచ్చింది. కానీ మేకింగ్  వీడియోలో ఆ సన్నివేశంలో అలా కనిపించడంతో ట్రోలింగ్ మొదలైంది. చిరంజీవి లాంటి స్టార్ హీరోని కూడా విడిచిపెట్టకుండా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.