షూటింగ్ లో జరిగే అరాచకాలను బయట పెట్టిన సీనియర్ నటుడు. ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు..

ఎన్ని సినిమాలు చేసినా..చిన్న ఆర్టిస్ట్ లను షూటింగ్ సెట్స్ లో ప్రొడక్షన్ వాళ్లు ఎంత చులకనగా చూస్తారో సీనియర్ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ తెలిపారు. షూటింగ్ సెట్స్ లో జరిగే సంచలన నిజాలకు బయట పెట్టారు రామృష్ణ.

Meka Ramakrishna Reveals Artists Struggles In Industry

ఎన్ని సినిమాలు చేసినా..చిన్న ఆర్టిస్ట్ లను షూటింగ్ సెట్స్ లో ప్రొడక్షన్ వాళ్లు ఎంత చులకనగా చూస్తారో సీనియర్ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ తెలిపారు. షూటింగ్ సెట్స్ లో జరిగే సంచలన నిజాలకు బయట పెట్టారు రామృష్ణ.

మేకా రామకృష్ణ రుతురాగాలు సీరియల్ తో  ఫ్యామిలీ ఆడియన్స్ కు సుపరిచితుడు. అంతే కాదు ఆయన వందలాది సినిమాలు చేసిన అనుభవం ఉన్న సీనియర్ నటుడు. పేరు తెలియకపోయినా.. చూడగానే గుర్తు పట్టే ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి సంచలన నిజాలు బయట పెట్టారు రామకృష్ణ. షూటింగ్ సెట్ లో ప్రోడక్షన్ బాయ్స్ ఎంత టార్చర్ పెడతారో.. తమను ఎంత నీచంగా చూస్తారో.. క్లియర్ గా కళ్ళకు కళ్లటినట్టు చెప్పారు రామకృష్ణ. ఇండస్ట్రీలో జరిగే అరాచకాలను బయటపెట్టాడు. సెట్స్‌లో ఆర్టిస్టులను దారుణంగా చూస్తారంటూ ఆవేదన చెందాడు.

సినిమా ప్రొడక్షన్‌ బాయ్స్‌ చిన్న ఆర్టిస్టులను చులకగా చూస్తారు. అది ఒకరకంగా తమకు న రకంగా అనిపిస్తుంది.. ఈ విషయంలో ఎన్నో సార్లు ఎన్నో మాటలు పడటం వల్లతన కళ్ళల్లో  చాలాసార్లు నీళ్లు తిరిగాయి అన్నారాయన. అడుక్కునేవాడికి కూడా ఇదిగో తీస్కో అని మర్యాదగా ఇస్తాం, కానీ ప్రొడక్షన్‌ బాయ్స్‌ తమపై అంతకంటే నీచాతినీచంగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి వాళ్లను చంపేయాలి అన్నంత కోపం వచ్చినా.. ఏం చేయలేని పరిస్థితి మాది అన్నారు మేక.

అంతే కాదు షూటింగ్ సెట్ లో ప్రోడ్యూసర్లు ఏం చేస్తున్నారంటే ఫుడ్‌ పెట్టేదగ్గర నాలుగైదు కేటగిరీలు పెట్టేస్తున్నారు. మనం పొరపాటున మనకి కేటాయించిన దాంట్లో కాకుండా పక్కదాంట్లోకి వెళ్లామంటే ధారుణంగా అవమానిస్తారు.. చాలా  హీనంగా చూస్తారు.ఈ విషయంలో తనకు చాలా సార్లు అవమానం ఎదురైంది అన్నారు రామకృష్ణ. హీరోలు, నిర్మాతలకు ఒకచోట, టెక్నికల్‌, డైరెక్షన్‌కు మరో దగ్గర, జూనియర్‌ ఆర్టిస్టులకు ఇంకో చోట, సెకండ్‌ గ్రేడ్‌ టెక్నీషియన్లకు మరో చోట టెంట్‌ వేస్తున్నారన్నారు.

ఇక  సపోర్టింగ్‌ ఆర్టిస్టులను  ప్రోడక్షన్ బాయ్స్ చాలా నీచంగా ట్రీట్‌ చేస్తారు. ఈ పాపం మీకు తగులుతుంది, నాశనం అయిపోతారు అని  చాలా మందిని మేకా రామకృష్ణ తిట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. నేనే కాదు ఎంతో మంది నాలాంటి నటులు ఇలాంటి అవమానాలు చాలా ఫేస్ చేశారంటున్నారు రామకృష్ణ. ఎంతోమంది కళ్లలో నీళ్లు పెట్టుకున్నారంటున్నారు మేక. కానీ ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలియదు.  

అయితే స్టార్స్ ను కూడా ఈ ప్రొడక్షన్ బాయ్స్ వదిలిపెట్టరు అంటున్నారు రామకృష్ణ. వారిని ఎవరైనా ఏమైనా అన్నా..పొరపాటు ప్రొడక్షన్‌ బాయ్స్‌ని ఎవరైనా తిడితే వాళ్లకు కాఫీలో మోషన్‌ టాబ్లెట్లు కలిపి ఇస్తారు. సహజనటి జయసుధగారికి కూడా ఒక సారి అలా చేశారంటూ చెప్పుకొచ్చారు రామకృష్ణ. ఇక  వారి అరాచాకాలకు పరాకాస్ట ఏంటీ అంటే.. టాయ్‌లెట్‌లో ఉండే నీళ్లను మంచినీళ్లుగా చెప్పి ఆర్టిస్ట్ లకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు మేకా రామకృష్ణ.

అయితే ఇలాంటివి అందరూ చేయరు. కొందరు మాత్రమే ఇంత ధారుణంగా ఉంటారు అన్నారు.  ఒక స్టార్ నా సెక్షన్ కాకుండా వేరే సెక్షన్ లో కూర్చుంటే.. సద్ది అన్న తీసుకువచ్చి పట్టారు. ఏంటీ అని అడితే మీ రేంజ్ ఇదే..అసలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అంటూ అవమానించారు అన్నారు రామకృష్ణ. అప్పుడే చచ్చిపోవాలి అనిపించంది అటూ తన బాధను వెల్లడించారు.

అంతే కాదు షూటింగ్ లొకేషన్ లో కొంత మందికే రూములిచ్చి.. మిగతా వాళ్లను గాలికి వదిలేస్తారు. అందరూ ఏ చెట్టుకిందనో.. పుట్టు మాటునో కూర్చొవాలి. ఇలాంటివి బయట చెప్పుకుంటే.. ఆతరువాత అవకాశాలు రావడంలేదు. మెల్ ఆర్టిస్ట్ లకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఛాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు అంటూ తీవ్రంగా ఆవేధన చెందారు మేకా రామకృష్ణ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios