వరుణ్ పెళ్ళి సందడి, క్లింకారతో చిరంజీవి, అయాన్ తో అల్లు అర్జున్ ఫోటోలు వైరల్
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళి వేడుకల్లో మెగా ఫ్యామిలీ సందడి మామూలుగా లేదు. టాలీవుడ్ కు చెందిన 9 మంది హీరోలు అక్కడే ఉండటంతో.. అంతా సందడి వాతావరణం నెలకొంది. అంతే కాదు.. ఈ వెడ్డింగ్ లో స్టార్ కిడ్స్ కూడా సందడి చేశారు.

వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో అట్టహాసంగా జరిగింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి.. తమ ప్రేమ ను పెళ్ళి బంధంగా మార్చుకున్నారు జంట. ఇక ఈ పెళ్ళి వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చేయగా.. టాలీవుడ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్న మెగా హీరోలంతా ఒక్క చోట సందడి చేశారు. అంతే కాదు దాదాపు 10 మంది హీరోలు ఈ ఈవెంట్ లో ఒకే చోట కనిపించడం విశేషం.
అంతే కాదు.. ఈ మెగా ఈవెంట్లో స్టార్ కిడ్స్ కూడా సందడి చేశారు. ఈ పెళ్ళికి మోయిన్ అట్రాక్షన్ గా నిలిచింది మెగా మనవరాలు క్లింకార. చిరంజీవి, సురేఖల గారాలా మనవరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లింకార ఈ పెళ్ళికి ప్రత్యేక ఆకర్శనగా మారింది. అయితే ఈ పెళ్ళిలో అందరూ కనిపించినా.. క్లింకారకు సబంధించిన పోటోలలో మాత్రం ముఖం కనిపించకుండా చూసుకున్నారు ఫ్యామిలీ. తాజాగా మెగాస్టార్ తన సతీమణితో కలసి క్లింకారను ముద్దు చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
అంతే కాదు ఈ ఈవెంట్ లో మరో ప్రత్యేక ఆకర్షణ అల్లు వారి పిల్లలు.. ఈ వెంట్ లో ఆధ్యంతం సందడి చేశారు వారు. ఈసంర్భంగా అల్లు అర్జున్ కూడా తన వారసులు అల్లు అయాన్ తో కలిసి ఓసరదా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటోలో దూరంగా తన భార్య స్నేహా రెడ్డి కూడా కనిపించారు. ఈ పిక్ ను తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశాడు ఐకాన్ స్టార్. ప్రస్తుతం ఈ పోటోలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ ఇంట్లొ అంతా మనవరాళ్ళే కావడంతో..వరుణ్ తేజ్ పెళ్లి మండపం అంతా వారితో సందడిగా మారింది. ఇటు లావణ్య ఫ్యామిలీ నుంచి కూడా చిన్నారులు తోడు అవ్వడంతో.. పెళ్ళిలో స్టార్ కిడ్స్ ప్రత్యేకంగా కనిపించినట్టు తెలుస్తోంది. అందే విధంగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు.. యంగ్ హీరో నితిన్ కూడా ఈ వెంట్ లో పాలు పంచుకున్నారు.