Asianet News TeluguAsianet News Telugu

Godfather : మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (Godfather). రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.  
 

Megastar Godfather Movie Pre Release event fixed, when and where?
Author
First Published Sep 25, 2022, 2:16 PM IST

మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన  పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు  మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో మలయాళంలో వచ్చిన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా వస్తుండటంతో చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార వంటి స్టార్స్ నటించడంతో అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఆకాశంలో ప్రమోషన్ ను నిర్వహించి మెగాస్టార్ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.  ఫస్ట్ సింగిల్ ‘థార్ మార్ థక్కర్ మార్’ కూడా అదిరిపోయింది. తాజాగా  మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. మరో పదిరోజుల్లో చిత్రం రిలీజ్ కానుండటంతో ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్, టైమ్ ఫిక్స్ చేస్తూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందించారు. 

ఏపీలోని అనంతపూర్ జిల్లాలో గల ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ఈవెంట్ ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు తాజాగా క్రేజీ పోస్టర్ ను కూడా వదిలారు. వేలాది మంది నాయకుల ముందు నిల్చున్న చిరు లేటెస్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు మోహన్ రాజా కొత్తగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా మరింత ఆసక్తి పెరుగోతంది. ఇప్పటికే చిరంజీవి కూడా సినిమాపై ఎన్ని ఆశలైన పెట్టుకోండి అంటూ ఇచ్చిన హామీతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

‘హనుమాన్ జంక్షన్’తో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించిన దర్శకుడు దర్శకుడు మోహన్ రాజా 20 ఏండ్ల తర్వాత మళ్లీ చిరంజీవిని డైరెక్ట్ చేసిన Godfatherను తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా గెస్ట్ రోల్ లో కనిపించనుండటం విశేషం. అదీగాక స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా నటించారు. హీరోయిన్ గా నయనతారా (Nayanthara) ఆడిపాడింది.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సత్యదదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, గంగవ్వ ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios