మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె ఓ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

అంతేకాదు పాప కాలిముద్రతో ఉన్న ఫోటోని కూడా షేర్ చేశాడు. 'ఈ ఏడాది క్రిస్మస్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. మాకు ఇవాళ ఉదయం పండంటి పాప జన్మించింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ పెట్టాడు కళ్యాణ్ దేవ్.

'విజేత' చిత్రంతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకి పులివాసు దర్శకత్వం వహించబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందించనున్నారు.