Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చూడబోతున్న మెగాస్టార్ చిరంజీవి

బ్రో సినిమా సక్సెస్ టాక్ తో జోష్ మీద ఉన్నారు...మెగా హీరోలు పవర్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్. బ్రో టీమ్ పండగ చేసుకుంటున్న వేళ.. మరో విషయం మెగా ఫ్యాన్స్ ను తెగ సంతోష పెడుతుంది.  దిల్ ఖుష్ చేస్తోంది. 
 

megastar Chiranjeevi will watch bro movie with pawan Kalyan Soon JMS
Author
First Published Jul 28, 2023, 10:14 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ తో.. సాయి ధరమ్ తేజ్ కాంబినేన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ బ్రో. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేసిన ఈమూవీ.. తమిళంలో వినోదయ సీత్తం కుతెలుగు రీమేక్. తమిళంలో కూడా ఈసినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశాడు. తెలుగులో మాత్రం డైరెక్ట్ చేయగా.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కాగా ఈరోజు (28 జులై)  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

బ్రో సినిమాను మెగా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో.. వారిలో క్యూరియాసిటీ ఓ రేంజ్ లో పెరిగింది. మొదటి నుంచే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనుకున్నట్టుగానే బ్రో మూవీ హిట్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. సక్సెస్ టాక్ తో బ్రో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా ఈసినిమాను చూడటానికి  మెగాస్టార్ చిరంజీవి  రెడీ అవుతున్నట్టుతెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ విషేశం ఉంది. 

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీని చూడబోతున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని స్వయంగా వెల్లడించారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్రో సినిమా కోసం చిరు గారు అడిగారు అని సినిమా ఎప్పుడు చూపిస్తావ్ అని అడగారట. దాంతో సంతోషంతో సముద్రఖని...  మీరు ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడే చూపిస్తాను అన్నారట.  అయితే వెంటనే చిరంజీవి  ఈ సినిమాను  పవన్ తో కలిసి చూస్తాను అన్నారట. అంతే కాదు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అవుతామన్నారట.  

త్వరలో మెగా ఫ్యామిలీ అంతా బ్రో సినిమాను కలిసి చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. ఈసినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ తో పాటు కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ ఊర్వశీ రౌతేలా స్సెషల్ సాంగ్ తో అలరించారు. ప్రస్తుతం ఈమూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా.. ఓటీటీ డీల్ కూడా ముగిసినట్టు తెలుస్తోంది. ఈమూవీపై ఫ్యాన్స్ , ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios