Asianet News TeluguAsianet News Telugu

అది...చిరు మీద కావాలని లేపిన రూమరా? దారుణం

  ఈ క్రమంలో చిరంజీవి ఈ రీమేక్  సినిమా చేయటం ఏంటని ఆలోచనలో పడ్డారు.అయితే అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి ఈ సినిమాకు సంభందించిన చర్చలు ఏమీ జరగలేదట.

Megastar Chiranjeevi to do Ajith  Viswasam is fake news?
Author
First Published Jan 20, 2023, 12:39 PM IST


ఓ సినిమా హిట్టైందంటే సినిమా లవర్స్, ఆ హీరో అభిమానులు సంతోషిస్తారు. అదే సమయంలో యాంటి ఫ్యాన్స్ కు కడుపు మండిపోతుంది. కానీ ఏమీ చెయ్యలేరు. ఆ క్రమంలో ఆ సినిమా పైనో లేక ఆ హీరో పైనో రూమర్స్ క్రియేట్ చేయటం మొదలెడతారు. ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి జోష్ తో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై రూమర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొందరు. అలాంటిదే వివి వినాయిక్ తో సినిమా అని తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య'  సక్సెస్‌ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను మరోసారి దున్నేస్తున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.  ఇదే ఊపులో చిరు.. మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన్నట్లు సమాచారం. చిరంజీవితో గతంలో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ని ఆ తర్వాత ఖైదీ నెంబర్ 786 వంటి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చిన వివి వినాయిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారని వార్తలు మొదలయ్యాయి.  ఈ సినిమా కూడా ఓ తమిళ రీమేక్ అని చెప్తున్నారు.

 తమిళ బ్లాక్ బస్టర్ 'విశ్వాసం' సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారని సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాంతో అభిమానులు ఖంగు తిన్నారు. 2019లో విడుదలైన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యాక్ట్ చేశారు.  అయితే  ఈ విశ్వాసం సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. టీవీలలో కూడా చాలాసార్లు ప్రసారం అయ్యింది. ఆల్రెడీ తెలుగు ఆడియెన్స్ చూసేసిన సినిమా కాబట్టి.. కచ్ఛితంగా ఈ రీమేక్‌పై ఆసక్తి అంతగా ఏర్పడదు.  దానికి తోడు ఇప్పటి ప్రేక్షకులు రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సాహించడం లేదు. 

ఓటీటీ లతో అన్ని సినిమాలను ఒరిజినల్ వర్షన్స్‌లోనే ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. అందుకే.. స్టార్ హీరోలందరూ ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.  ఈ క్రమంలో చిరంజీవి ఈ సినిమా చేయటం ఏంటని ఆలోచనలో పడ్డారు.అయితే అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి ఈ సినిమాకు సంభందించిన చర్చలు ఏమీ జరగలేదట. వివివినాయిక్ అయితే సినిమా ఉందిట. అయితే అది మాత్రం ఈ రీమేక్ కాదట. అలాగే ఇది కొందరు చిరంజీవి అంటే గిట్టని వాళ్లు క్రియేట్ చేసిన రూమర్ అని తెలుస్తోంది.

మరో ప్రక్క సోషల్ మీడియాలో మెగాభిమానులు.. చిరుని ఈ సినిమా చేయొద్దని  రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ రీమేక్ బదులు వాల్తేరు వీరయ్య తరహాలోనే ఫ్రెష్ కథలతో సినిమాలు చేయాల్సిందిగా కోరుతున్నారు.   ఇదిలా ఉంటే చిరంజీవి చేస్తున్న  'భోళా శంకర్' చిత్రం అజిత్ 'వేదాళం' తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ మెగా సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ కనిపించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios