కరోనా థార్డ్ వేవ్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈసారి సెలబ్రెటీ స్టార్స్ టార్గెట్ గా కారోనా విజృంబిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు.. సినిమా స్టార్స్ ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు.

కరోనా అంతకంతకు కోరలు చాచుతోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ ఎవరినీ కరోనా వదిలిపెట్టడంలేదు. ముఖ్యంగా ఈ థార్డ్ వేవ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. సినిమా వాళ్లను కోవిడ్ వదిలిపెట్టడం లేదు. మహేష్ బాబు(Mahesh Babu), తమన్, ధనుష్ ఇలా స్టార్స్ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా పాజిటీవ్ వచ్చినట్టు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించాయని.. దాంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్గా తేలిందని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవలసిందిగా ఆయన కోరారు. కరోనా అని తెలియడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళారు మెగాస్టార్.

Scroll to load tweet…

గణతంత్రదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇదే రోజు ఆయన కోవిడ్ బారిన పడ్డారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి కరోనా రావడం ఇది రెండో సారి. లాస్ట్ టైమ్ కూడా చిరంజీవికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అప్పుడు లక్షణాలు లేకుండా.. సాధారణ పరిక్షల్లో కారోనా అని తేలింది. ఇక ఇప్పుడు రెండో సారి స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డారు మెగాస్టార్.