టాలెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా వెండితెరపై స్టార్ హోదా తెచ్చుకోవచ్చని చాలా మంది నటీనటులు నిరూపించారు. సపోర్ట్ తో వచ్చిన వారందరు సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హీరోల ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మెగా ఫ్యామిలీ హీరోలు వారి స్థాయికి తగ్గట్టు ఒక మార్కెట్ ను సొంతంగా సెట్ చేసుకున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు మాత్రం మెరుపుతీగలాగా అలా కనిపించి అలా వెళ్లిపోయాడు.

కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి సినిమా విజేత ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ కోణంలో చూసుకున్నా కూడా సినిమా పాజిటివ్ టాక్ ను అంతగా తెచ్చుకోలేదు. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. మెగా ఫ్యామిలీ అయితే పెద్దగా హంగామా చేయలేదు. కళ్యాణ్ సొంత టాలెంట్ తో నిలదొక్కుకోవాలని మొదటి సినిమాకే ఒంటరిగా వదిలేశారు. ఇక కళ్యాణ్ మాత్రం నటనాపరంగానే కాకుండా ఒక హీరోకి ఉండాల్సిన వివిధ అంశాల్లో అవగాహనా పెంచుకోవాల్సి ఉందనే టాక్ వచ్చింది.  ఆ విషయం పక్కన పెడితే మొదటి సినిమా ఊహించని ఫలితాన్ని ఇవ్వడంతో కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో అయినా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు.

కానీ మెగా స్టార్ చిరంజీవి మాత్రం తొందరవద్దని చెబుతున్నట్లు టాక్ వస్తోంది. కొన్ని రోజులు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్ గా ఉండడం బెటర్ అని సలహా ఇస్తున్నారట. అప్పటివరకు నటనపై మరింత ద్రుష్టి పెట్టి పెట్టమని ఆ తరువాత ఎలాంటి కథనైతే ఒకే చేస్తావో ఆ కథకు తగ్గట్టు సిద్ధమవ్వాలని మెగా ఫ్యామిలి సభ్యులు చెబుతున్నారట. మరి కళ్యాణ్ సెకండ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.