కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) తాజాగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘విక్రాంత్ రోణా’. ఈ చిత్ర తెలుగు రిలీజ్ డేట్ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. మంచి సినిమా చేస్తున్నందుకు సుదీప్ ను ప్రశంసించాడు.
కన్నడ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న సుదీప్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కన్నడతో పాటు తమిళం, హిందీ, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యాడు. సుదీప్ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుతో నార్త్, సౌత్ ఆడియెన్స్ ను అలరించనున్నాడు. అడ్వెంచర్ మరియు థ్రిల్లర్ తో కూడిన ‘విక్రాంత్ రోణా’ (Vikranth Rona) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి అనుప్ భండారి దర్శకత్వం వహించారు. హీరోయిన్ నీతా అశోక్ (Neetha Ashok) సుదీప్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే హింగ్లీష్ లోనూ మొట్టమొదటి సారి సుదీప్ వాయిస్ తో డబ్ చేయడం విశేషం.
తాజాగా ‘విక్రాంత్ రోణా’ చిత్ర మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం 3డీలో జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), హిందీలో సల్మాన్ ఖాన్ (Salman khan) అడ్వెంచర్ మూవీ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ లో సుదీప్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘చూడటానికి అద్భుతంగా ఉంది. కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అనుప్ భండారికి, చిత్ర యూనిట్ కు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. విక్రాంత్ రోణా మూవీ 3డీలో వస్తుండటం అభినందనీయమని, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ (God Father) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగానే సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా నటించేందుకు ఒప్పుకున్నట్టుగా టాక్. మరీ ఇద్దరు మెగాస్టార్లు ఒకే స్క్రీన్ పై ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తిగా నెలకొంది. గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతారా (Nayanatara) చిరు సరసన ఆడిపాడనుంది. ఫేమస్ యాక్టర్ సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెన్సేషనల్ స్టార్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.