Asianet News TeluguAsianet News Telugu

Godfather : డైలాగ్ చెప్పాలంటే భయపడ్డ చిరంజీవి.. మొన్నటి దానికే రచ్చ.. మరో పవర్ ఫుల్ డైలాగ్ వదిలిన మెగాస్టార్.!

‘గాడ్ ఫాదర్’ నుంచి మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వదిలిన డైలాగ్ కే రచ్చరచ్చ జరిగింది. ఆ పొలిటికల్ ఎంట్రీ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.  తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మరో డైలాగ్ ను వదిలారు. ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
 

Megastar Chiranjeevi left another dialogue form Godfather Movie in Pre Release Event
Author
First Published Sep 28, 2022, 11:17 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (Godfather) ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీలో గ్రాండ్ గా కొనసాగింది. ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తన స్సీచ్ చివర్లో సినిమా నుంచి అదిరిపోయే డైలాగ్ ఒకటి చెప్పారు. అయితే ఇప్పటికే చిత్రం నుంచి ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ సరదగా వదిలిన పవర్ ఫుల్ డైలాగ్ పై విపరీతంగా చర్చ కొనసాగింది. ‘తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు మాత్రం తనను వదలడం లేదంటూ’ చిరంజీవి చెప్పిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయాలతో చిరు టచ్ లోనే ఉన్నారని టీవీ ఛానెళ్లలో తెగ చర్చ జరిగింది.  ఈ క్రమంలో సినిమా నుంచి పొలిటికల్ కు సంబంధించిన మరో స్ట్రాంగ్ డైలాగ్ ను వదిలారు.

చిరంజీవి మాట్లాడుతూ.. మీకోసం సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పాలని ఉంది. కానీ మొన్న సరదగా వదిలిన డైలాగ్ కే డిబేట్లు, చర్చలు చేసి రచ్చరచ్చ చేశారు. అయినా సరే మీకోసం సినిమాలోని మరో బెస్ట్ డైలాగ్ ను వదులుతున్నాను.  కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ, హాల్లో తను చెప్పిన  డైలాగ్ ను చెబుతున్నాను. ‘ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్ట్ లు, ఇసుక కాంట్రాక్ట్ లు, నేల కాంట్రాక్ట్ లు, కొండ కాంట్రాక్ట్ లు, మద్యం కాంట్రాక్ట్ లు  అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీ ఊపిరి, గాలి కాంట్రాక్ట్ తీసుకుంటున్నాను. సుపరిపాలన చేయాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ మన్సస్సులో ఏదీ ఉండకూడదు. ఏదన్నా జరగకూడనిది జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది’ అంటూ మరో స్ట్రాంగ్ డైలాగ్ ను వదిలారు. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వదిలిన ఈ డైలాగ్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎప్పుడూ రాయలసీమ అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కుతూనే ఉందన్నారు. వర్షం పడుతున్నా ఒక్కరూ ఈవెంట్ ప్రాంగణం నుంచి కదలకపోవడం సంతోషంగా ఉందన్నారు. అనూహ్యంగా అభిమానులు ఈవెంట్ కు రావడం ఆనందగా ఉందని తెలిపారు. ‘అందరూ నన్ను గాడ్ ఫాదర్ అంటున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి నిలదొక్కుకునేలా చేసిన అభిమానులే నాకు గాడ్ ఫాదర్. చిరంజీవి గాడ్ ఫాదర్ అంటే అభిమానులే’నని ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. అభిమానులు చూపిస్తూ అనంతమైన ప్రేమను మరిచిపోలేనని తెలిపారు. దీంతో అభిమానుల అరుపులతో ఈవెంట్ ప్రాంగణం హోరెత్తిపోయింది.
 
విజయదశమి సందర్భంగా అక్టోబర్ 05న ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.  ఫస్ట్ సింగిల్ ‘థార్ మార్ థక్కర్ మార్’, సెకండ్ సాంగ్ ‘నజభజ’ సాంగ్ అదిరిపోయాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా గెస్ట్ రోల్ లో కనిపించనుండటం విశేషం. హీరోయిన్ గా నయనతారా (Nayanthara) ఆడిపాడింది.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios