Asianet News TeluguAsianet News Telugu

మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి బర్త్ డే గిఫ్ట్.. అప్పుడే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మరి...

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. తమ ఆరాధ్య నటుడి పుట్టిన రోజు సందర్భంగా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఫ్యాన్స్ ను అలరించబోతోంది...? 

Megastar chiranjeevi Indra Movie Re Release Bookings Starts JMS
Author
First Published Aug 17, 2024, 7:45 PM IST | Last Updated Aug 17, 2024, 7:45 PM IST

దాదాపు 40 ఏళ్ళుగా టాలీవుడ్ లో రారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. టాలీవుడ్ కు పెద్దన్న స్థాయికి ఎదిగారు మెగాస్టార్. తెలుగు సినిమా పరిశ్రమలో మెగా సాంమ్రాజ్యాన్ని విస్తరింపచేసి.. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న చిరంజీవి.. త్వరలో 69 వ ఏడాదిలోకి ప్రవేశించబోతున్నారు. ఏడుపదుల వయస్సుకు అడుగు దూరంలో ఉన్న చిరు.. 

ఈ వయస్సులో కూడా ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా డాన్స్ చేస్తున్నారు.. కుర్రహీరోలను మించి స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నారు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ఇక మెగాస్టార్ ను ఆరాధించేవారు ఇండస్ట్రీలో లక్షల్లో ఉంటారు. ఆయన ఆదర్శంగా ఇండస్ట్రీకి వచ్చినవారెందరో...? 

ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. ట్రెండ్ కు తగ్గట్టుగానే ఆయన సినిమాలను రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి న‌టించిన ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా ఇంద్ర ను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజ‌యంతి మూవీస్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా  స్టార్ట్ అయ్యాయి. అయితే కొత్త సినిమాల రిలీజ్ లు ఉండటంతో.. ఇంద్ర రిలీజ్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

అయితే ఇంద్ర సినిమా రిలీజ్ అయితే.. రవితేజ మిస్టర్ బచ్చన్ తో పాటు.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాల కలెక్షన్లు ప్రభావితం అవుతయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో ముందుగా ఈసినిమా రిలీజ్ పై సందేహాలు వ్యక్తం అయిన క్రమంలో.. రెండు సినిమాలు రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇంద్ర రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది అంటున్నారు. ఇక తాజాగా బుక్కింగ్స్ స్టార్ట్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మరి ఈమూవీ రీరిలీజ్ లతో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios