Asianet News TeluguAsianet News Telugu

చరణ్ కోసం రెడీ చేసిన కథతోనే చిరు నెక్ట్స్?, షాకింగ్ గా ఉంది కదా

ఈ మేరకు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగినట్లు ఇప్పుడు స్క్రిప్టులో మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది.   అందుకోసం వశిష్ట సినిమాకు పని చేస్తున్న  రైటర్స్ ని చెన్నై పంపి మిత్రన్ తో పనిచేయిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం. 

Megastar Chiranjeevi  in the direction of PS Mithran confirmed jsp
Author
First Published Oct 24, 2023, 9:27 AM IST

మెహర్‌ రమేశ్‌దర్శకత్వంలో రూపొందిన  ‘భోళాశంకర్‌’ సినిమా  డిజాస్టర్ కావటంతో చిరంజీవి ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకమైన ఈ స్టేజిలో సరైన సినిమాలు చేయకపోతే తన కెరీర్ క్లైమాక్స్ సరిగ్గా మలుచుకోలేము అని చిరంజీవి భావిస్తున్నారు.అందుకు తగినట్లు దర్శకులులో మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు.  ఈ క్రమంలో యంగ్ దర్శకుడు వశిష్టతో ఆయన చిత్రం ప్రారంభించారు. ఈ స్క్రిప్టు వర్క్ కూడా పూర్తైనట్లు సమాచారం. మరో ప్రక్క చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే కథ అనుకున్నట్లుగా రాలేదని దాన్ని ఆపేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగని చిరంజీవి ,కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు లేనట్లు కాదు...మరో మంచి కథ సెట్ కాగానే ఆ పనులు ప్రారంభమవుతాయి. ఈ మధ్యలో చిరంజీవి, ఓ తమిళ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి.
 
తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఓ  కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. మిత్రన్ గతంలో సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అభిమ‌న్యుడు లాంటి క్లాసిక్ ని విశాల్ హీరోగా తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ తర్వాత అదే మిత్ర‌న్ ...కార్తీతో సర్దార్ సినిమా చేసారు. ఇప్పుడు మెగాస్టార్ కి  క‌థ చెప్పి ఓకే చేయించుకున్నారని అంటున్నారు. అయితే ఈ కథని మొదట రామ్ చరణ్ కోసం చెప్పారని, అయితే చరణ్ తాను వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని,కొద్ది పాటి మార్పులతో తన తండ్రితో చేయివచ్చు అని సజెక్ట్ చేసారని తమిళ సినిమా వర్గాల్లో చెప్పుకుంటున్నారు. 

 ఈ మేరకు చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగినట్లు ఇప్పుడు స్క్రిప్టులో మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది.   అందుకోసం వశిష్ట సినిమాకు పని చేస్తున్న  రైటర్స్ ని చెన్నై పంపి మిత్రన్ తో పనిచేయిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం. వశిష్ట సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా వర్క్ పూర్తవ్వాలని భావిస్తున్నారట.  ఈ చిత్రానికు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఓ నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. అయితే మిత్రన్ తో సినిమా ఎగ్రిమెంట్ చేసుకున్న ఓ తమిళ బ్యానర్ సైతం ఈ ప్రాజెక్టుని కో ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది.  అయితే ఈ విషయాలపై పూర్తి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios