Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి నటజీవితానికి 44 ఏళ్ళు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి పుట్టి నేటికి 44ఏళ్ళు.. అరవై ఏళ్ల వయసు దాటిని ఆయన నటుడిగా పుట్టి 44 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు చిరు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Megastar Chiranjeevi Emotional Tweet On His Movie Career
Author
First Published Sep 22, 2022, 11:45 PM IST

జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్తానం స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా.. ఆతరువాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సీనీ సాంమ్రాజ్యాన్ని తన కుటుంబంలోనే స్థాపించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారనంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన ఆయన.. సినిమా రంగంలోకి వచ్చి 44 ఏళ్లు పూర్తి అయ్యాయి. 

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు  (గురువారం) తన జీవితంలో ఓ కీలక  మైలు రాయిని దాటారు. తన జీవితంలో అనడం కంటే.. సినిమా జీవితంలో ఈ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నారు అనవచ్చు. ఈ సందర్భంగా ఆయన తన మూవీ కెరీర్ ను  గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. తన అసలు పేరు స్థానంలో చిరంజీవి పేరుతో మొదలుపెట్టిన తన ప్రయాణం గురువారం (సెప్టెంబర్ 22)తో 44 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ రకంగా నటుడిగా తను పుట్టి 44 ఏళ్లు అని ఆయన పేర్కొన్నారు. 

 

 

1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు' విడుదలైందని పేర్కొన్న చిరంజీవి.. ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని గుర్తు చేసుకున్నారు. 'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈ రోజు' అని ఆయన పేర్కొన్నారు. ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రాణం పోసి... అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారంటూ ఆయన తెలిపారు. తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి కీలక మైలు రాయి దాటిన సందర్భంగా మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయన ట్వీట్ కు రిప్లై ఇస్తుననారు. చిరును దేవుడితో పోలుస్తూ.. ఇంకా మరిన్ని సంవత్సరాలు మెగాస్టార్ గా అదరగొట్టాలంటూ కోరుకుంటున్నారు. చిరు ఎమోషనల్ అయ్యే సరికి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం జోరు మీద ఉన్న చిరంజీవి.. వరుసగా సినిమాలుసెట్స్ ఎక్కిస్తున్నారు. ఆయన నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్భంగా రిలీజ్ అవ్వబోతోంది. ఇక బాబీడైరెక్షన్ లో ఓ సినిమాతో పాటు భోళా శంకర్, వెంకటీ కుడుములతో కొత్త సినిమాను ప్లాన్ చేశాడు. ఇలా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీఇస్తున్నాడు చిరు. డబుల్ సెంచరీ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్. 

Follow Us:
Download App:
  • android
  • ios