మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏజ్ పెరుగుతున్నా.. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్(Megastar Chiranjeevi) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టే.. అటు కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

వరుస సినిమాలతో చిరంజీవి (Megastar Chiranjeevi) ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు సినిమాల వరకూ ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ఆచార్య (Acharya) రిలీజ్ కు రెడీగా ఉంటే.. గాడ్ ఫాదర్ సెట్స్ మీద ఉంది. డైరెక్టర్ బాబీతో, మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాలతో ప పాటు వెంకీ కుడుమలతో మరో సినిమా ఫిక్స్ అయ్యారు. మరో రెండు సినిమాలు కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వెళ్ళిన చిరు (Megastar Chiranjeevi) 2017 లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. ఇక ఇప్పుడు కమర్షియల్స్ విషయంలో కూడా చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో సాప్ట్ డ్రింక్ యాడ్ తో పాటు మరికొన్ని కమర్షియల్ యాడ్స్ లో కనిపించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి యాడ్ ఫిల్మ్స్ లో మెరవబోతున్నారు.
ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సంతకం చేసినట్టు సమాచారం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన బ్రాండ్ అంబాసడర్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ రానుందని తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ తో బిజీగా మారి కోట్లు సంపాదిస్తున్నారు మెగా స్టార్స్.