మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్ ఫ్రోఫైల్ నేమ్ ను మార్చేశారు. పేరు మార్చిన తరువాత ఆయన పెట్టిన ఫస్ట్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  


మెగాస్టార్ చిరంజీవి దూకుడు చూపిస్తున్నారు. అటు సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా మెగా దూకుడు గట్టిగానే ఉంది. చిరంజీవి సినిమా ఆచార్య ఈనెల 29న రిలీజ్ కాబోతోంది. దాంతో ఈసినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టిన చిరంజీవి అండ్ టీమ్ దానికి తగ్గట్టు ఏర్పాట్ల చేసుకుంటుంది. ఇందులోభాగంగానే తన ట్విట్టర్ పేజ్ పేరును మార్చేశారు మెగాస్టార్. 

మెగాస్టార్ చిరంజీవిని కొరటాల శివ ఆచార్యగా మార్చేశారు. సినిమాలోనే కాదు.. ట్విట్టర్ అకౌంట్ లోనూ చిరంజీవి ఆచార్యాగా మారిపోయారు. తన ట్విట్టర్ ఖాతా పేరును ఆచార్యగా మార్చుకున్నారు మెగాస్టార్. అంతే కాదు పేరు మార్చిన తరువాత చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన కుమారుడు రామ్ చరణ్ కు సంబంధించి మనసుకు హత్తుకునే ఓ ఇన్ స్టా వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేశారు. 

Scroll to load tweet…

చిరంజీవికి హనుమంతుడంటే చాలా ఇష్టం స్వతహాగా హనుమంతుడి భక్తుడైన మెగాస్టార్ ఈరోజు (ఏప్రిల్ 16) హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు. ఈ వీడియోలో ఓ కోతికి బిస్కెట్స్ తినిపిస్తున్నాడు రామ్ చరణ్ 

కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా.. ఓ వానరం అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయంను బ్యాగ్రాండ్ గా ఆడ్ చేసి మెగాస్టార్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందు.