Asianet News TeluguAsianet News Telugu

చేతిలో త్రిశూలంతో విశ్వంభరుడుగా చిరంజీవి, మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది..

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. విశ్వంభరుడిగా చిరంజీవి ఫస్ట్ లుక్ సందడి చేస్తోంది..
 

Megastar Chiranjeevi Birthday Gift Vishwambhara First Look Special poster Release JMS
Author
First Published Aug 22, 2024, 11:36 AM IST | Last Updated Aug 22, 2024, 11:36 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు .. ఆయన బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. చాలా కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చిరంజీవి పుట్టిన రోజు కావడంతో చిరంజీవికి అన్ని రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.  స్టార్లు సూపర్ స్టార్లు సోసల్ మీడియా వేదికగా ఆయన్ను విష్ చేస్తున్నారు. పర్సనల్ గా కూడా పోన్ చేసి విష్ చేస్తున్నారు. ఇక  ఫ్యాన్స్ హడావిడికి హద్దే లేదు. ఉదయం నుంచి మెగాస్టార్ ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. అయితే చిరు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. 

ఇక చిరంజీవి పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ ఎదురుచూసిన విధంగా  సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని కూడా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యువీ క్రియేషన్స్ లో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుంచి  ప్యాన్స్ కోసం సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు టీమ్. విశ్వంభర నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇక   త్రిశూలం పట్టుకుని.. విశ్వంభరుడిగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సందడి చేశారు. 

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. సోషియో ఫాంటసీ బ్యాగ్రౌండ్ తో రూపొందుతున్న ఈసినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఇంపార్టెంట్ అవ్వబోతోంది. ఇక ఈ సినిమా లో చిరంజీవి జంటగాత్రిష నటిస్తుండగా.. ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. దాదాపు 20 ఏళ్ళ తరువాత త్రిష మెగాస్టార్ జంటగా నటిస్తుండటం విశేషం.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. 

ఇక  మూవీ షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు దర్శకుడు. త్వరలో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రోడక్షన్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ఈ సారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ పోటీలో ఉండటంతో.. చిన్న సినిమాలు రిలీజ్ కు భయపడుతున్నాయి. మరి విశ్వంభరుడు ఎలాంట రిజల్ట్ ఇస్తాడో  చూడాలి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios