మెగా ప్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు చిరంజీవి. పరుగులుపెడుతున్న భోళా శంకర్ మూవీ షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ పై సర్ ప్రైజ్ ఇచ్చారు.
తనకు బాగా కలిసొచ్చి.. సూపర్ హిట్ కొట్టిన ప్లేస్ లో.. తాజా సినిమాషూటింగ్ ను జరుపుకోబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ తాజా షెడ్యూల్ కోసం మూవీటీమ్ అంతా కోల్ కతా ప్రయాణం అవ్వగా.. డైరెక్టర్ మోహర్ రమేష్ తో కలిసి స్పెషల్ ప్లైట్ లో కలకత్తా బయలుదేరారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ ఇంపార్టెంట్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారట మూవీ టీమ్.
మొన్నటి వరకూ హైదరాబాద్‌లో భోళా శంకర్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం భోళా శంకర్ టీమ్ కోల్‌కతాకు ప్రయాణం అయ్యింది. డైరెక్టర్ మెహర్ రమేశ్, చిరంజీవి బెంగాల్ కు బయలు దేరుతున్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక కోల్‌కతాలో తాజా షెడ్యూల్ రేపు స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరిగిపోయినట్టు తెలుస్తోంది.
గతంలో మెగాస్టార్ చూడాలని ఉంది సినిమా కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లోనే సాగింది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సెంటిమెంట్ ను రిపిట్ చేయబోతున్నారు చిరు. ఇదే సక్సెస్ భోళా శంకర్‌ను కూడా వరిస్తుందని ఆశతో ఉన్నారు. ఈ కథ కూడా కాస్త కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని.. హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇక ఈమూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 11న మెగాస్టార్ బర్త్ డే కానుకగా భోళా శంకర్ రిలీజ్ చేయబోతున్నారు. భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఈ ఏడాది బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు చిరంజీవి . ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది.
