మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజగా రాబోతున్న సినిమా భోళా శంకర్. ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గరలో ఉండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. తాజాగా ఈమూవీ ప్రిరిలీజ్ కు సబంధించి అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టయినర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈసినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మెగా ఫ్యాన్స్ భోళా శంకర్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈమూవీకి సబంధించి ఓ అప్ డేట్ తాజాగా వైరల్ అవుతోంది.
కాగా, భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 6 ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వేడుక హైదరాబాదులోనా, లేక విజయవాడలోనా అనే విషయంలో ఇంకా సందిగ్థత కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలు హైదరాబాద్ లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడే చేయాల్సి వస్తే.. ఒకవేళ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగే అవకాశాలున్నాయి.
అయితే రిలీజ్ కు ఇంకా వారం పదిరోజులు మాత్రమే ఉండటంతో.. త్వరగా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా రంగంలోకి దిగారు. ఇక మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తుండడం విశేషం.
ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈసినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈమూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, మురళీశర్మ, రవిశంకర్, తులసి, శ్రీముఖి, సురేఖా వాణి, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈసినిమా మెగా అభిమానులకు మంచి విజ్యూవల్ ఫీట్ అవుతుంది అంటున్నారు సినీ జనాలు.
